Visakhapatnam : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖకు మరొక డేటా హబ్

విశాఖపట్నానికి మరొక అద్భుతమైన ప్రాజెక్టు రానుంది.

Update: 2025-11-27 04:03 GMT

విశాఖపట్నానికి మరొక అద్భుతమైన ప్రాజెక్టు రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ , డేటా హబ్ గా విశాఖపట్నాన్ని మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తున్నట్లే కనిపిస్తుంది. తాజాగా . రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాల్టీల మధ్య జాయింట్ వెంచర్ గా ఏర్పడిన డిజిటల్ కనెక్షన్ 1 గిగావాట్ న AI-నేటివ్ డేటా సెంటర్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. విశాఖలో సుమారు పదకొండు బిలియన్ల డాలర్లు అంటే లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నామని ప్రకటించింది. విశాఖ డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాకు మారుతోందని నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల అనేక వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం చెబుతుంది.

ఇప్పటికే అనేక ప్రాజెక్టులు...
విశాఖపట్నానికి ఇప్పటికే పలు ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి. ఒప్పందాలు చేసుకున్నాయి. అనేక ఐటీ సంస్థలతో పాటు గూగుల్ డేటా సెంటర్ కూడా రానుండటంతో ఇక కంపెనీలు వరసబెట్టి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విశాఖపట్నం రూపు రేఖలు మారబోతున్నాయి. హైదరబాద్ కు ధీటుగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తున్నట్లే కనిపిస్తుంది. రిలయన్స్ , బ్రూక్ ఫీల్డ్, డిజిటల్ రియాల్టీల కు సంబంధించిన ప్రాజెక్ట్ మొత్తం నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో 2030 నాటికల్లా పూర్తవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ తో ఎంవోయూ చేసుకున్నారు. గూగుల్ చతర్వాత ఇది రెండో పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ అని ప్రభుత్వం చెబుతోంది.
డిజిటల్ ఇన్ ఫ్రాపై...
ఈ డేటా సెంటర్లు ప్రత్యేకంగా AI-నేటివ్‌గా, పర్పస్-బిల్ట్‌గా రూపొందిస్తామని డిజిటల్ కనెక్షన్ ప్రకటించింది. డిజిటల్ కనెక్షన్ డేటా సెంటర్లు సీమ్‌లెస్ AI వర్క్‌లోడ్‌లకు ప్రత్యేకంగా రూపొందించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గతంలో డిజిటల్ ఇన్‌ఫ్రా మీద దృష్టి పెట్టినట్లుగా ప్రకటించారు. ఆ క్రమంలో ఇతర కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. AI, క్లౌడ్ సర్వీస్‌ల పెరుగుదలతో డేటా సెంటర్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఈ ఇన్వెస్ట్‌మెంట్ దక్షిణాది రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది. గూగుల్ తో పాటు ప్రముఖ కంపెనీ రిలయన్స్ కూడా ఈ రంగంలోకి వస్తుండటంతో విశాఖపట్నం మరింత ఐటీ రంగంలో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News