Chandrababu : విశాఖను ఎవరూ ఆపలేరు : చంద్రబాబు
టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలో కాగ్నిజెంట్ తో పాటు తొమ్మిది ఐటీ సంస్థలకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక విజన్ తో తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. తన ఆలోచనలన్నీ ఆకాశమే హద్దుగా సాగుతాయని తెలిపారు. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ విశాఖలో ఏర్పాటు చేయడం శుభపరిణామమని, ఏడాదిలో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఐటీ కంపెనీలకు హబ్ గా...
విశాఖ ఐటీ కంపెనీలకు హబ్ గా మారుతుందని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని చంద్రబాబు తెలిపారు. త్వరలో విశాఖకు మెట్రో కూడా వస్తుందని, విశాఖ రూపు రేఖలు మారనున్నాయని చంద్రబాబు తెలిపారు. పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా ఐటీ రంగానికి ఇది హబ్ అవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.