జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు వేళల మార్పులివే
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే మార్చింది
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే మార్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి కొత్త వేళలు అమలులోకి రానున్నాయి. విశాఖలో ఉదయం 6.20 గంటలకు బయలుదేరి రాత్రి 7.16 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
మారిన వేళలు...
అలాగే లింగంపల్లి నుంచి ఉదయం 6.55 గంటలకు బయలుదేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ రాత్రి 7.50 గంటలకు చేరుకుంటుని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ రైలు వేళలను గమనించి స్టేషన్లకు చేరుకోవాలని కోరింది. అలాగే సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు