Andhra Pradesh : సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటున్న యువతకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటున్న యువతకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది జనవరి నుంచి విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థలో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకాన్ని కూడా కాగ్ని జెంట్ సంస్థ త్వరలో చేపట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
విశాఖలో వచ్చే జనవరి నుంచి...
ఆంధ్రప్రదేశ్ లో కాగ్నిజెంట్ వచ్చే జనవరి నుంచి విశాఖలో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిసింది.. తాత్కాలిక భవనంలో తొలుత డెలివరీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. తొలుత ఎనిమిది వందల ఉద్యోగులతో ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇతర కాగ్నిజెంట్ సెంటర్లలో పనిచేసే కొందరిని ఇక్కడికి తరలించనుంది. కాగా ప్రభుత్వం ఈ కంపెనీకి కాపులుప్పాడలో 21.33 ఎకరాలను కేటాయించింది. రూ.1,583 కోట్లతో కార్యాలయ నిర్మాణం, 8వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటు చేసింది.