రేపు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం

రేపు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం జరగనుంది.

Update: 2025-04-18 12:08 GMT

రేపు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం జరగనుంది.విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. అవిశ్వాసం నెగ్గేలా కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈరోజు మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు రానున్నారు. 58 మంది కార్పొరేటర్లకు విప్‌ జారీ చేసిన వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని విప్‌ జారీ చేసింది.

మేయర్ పై అవిశ్వాసం...
ప్రత్యేక సమావేశానికి హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయించింది. విప్‌ జారీ తర్వాత వైసీపీకిమాజీమంత్రి అవంతి కూతురు లక్ష్మీప్రియాంక రాజీనామా చేశారు. కౌన్సిల్‌లో వైసీపీ చీఫ్‌ విప్‌గా ఉన్న లక్ష్మీప్రియాంక రాజీనామా చేయడంతో ప్రస్తుతం 64 మంది సభ్యులకుకు చేరిన కూటమి బలం చేకూరున్నట్లయింది. ప్రస్తుతం ముప్పయికి పడిపోయిన వైసీపీ కార్పొరేట్ల సంఖ్య. దీంతో రేపు అవిశ్వాసంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News