విశాఖ వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో కోచ్ ల సంఖ్య పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం సికింద్రాబాద్ - వందే భారత్ రైళ్లకు పథ్నాలుగు కోచ్ లు ఉండగా ఆ సంఖ్యను పద్దెనిమిదికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల మరింత మంది ప్రయాణికులు వందేభారత్ రైలులో ప్రయాణించే వీలుంది. పెరిగిన కోచ్ లు నేటి నుంచి అమలులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
అదనపు బోగీలు...
సికింద్రాబాద్ నుంచి ఉదయం 5.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖకు చేరుతుంది. తిరిగి విశశాఖ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి పదకొండుగంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. విశాఖతో పాటు ముంబయి - బళార్ష, ముంబయి- చెన్నై సెంట్రల్, మైసూరు - రేణిగుంట, కొల్లాపూర్ - నాగపూర్ రైళ్లలోనూ బోగీలను అదనంగా నాలుగు పెంచినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.