మోదీ సర్కారుపై విరుచుకుపడ్డ టీడీపీ ఎంపీ

Update: 2016-11-29 05:12 GMT

విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తాం అని చెప్పారు కదా.. మీకు ఆ పని చేయడం చేతకాక, మీ వల్ల కాక మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు. జనం కష్టాలు చూడండి, ప్రజల బాధల్ని గుర్తించండి, లేకపితే చాల ఇబ్బంది డి అవుతుంది... అంటూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ మోడీ సర్కారుపై విరుచుకు పడ్డారు. ప్రభుత్వ విధానాల మీద విచిత్ర వేషధారణాలతో పార్లమెంటు ఆవరణలో అందరి దృష్టిని ఆకర్షించే అయన మంగళవారం నాడు బ్లాక్ అండ్ వైట్ చొక్కా వేసుకుని, వాటిమీద నల్లకుబేరుల వికటాట్టహాసం, పేదల ఏడుపులు ఉన్న చిత్రాలు ముద్రించుకుని పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేసారు.

ప్రధాని నరేంద్రమోడీ ప్రజల్లోంచి గెలిచిన నాయకుల అభిప్రాయాలు తీసుకుని వాటి ప్రకారం నడచుకుంటే జనానికి కష్టాలు రావని, జనంతో సంబంధం లేకుండా సభలోకి వచ్చిన నాయకుల మాటలు వింటే ప్రభుత్వానికి చేటు తప్పదని శివప్రసాద్ హెచ్చరిస్తున్నారు. తద్వారా అరుణ్ జైట్లీ , వెంకయ్య నాయుడు వంటి నేతలపై విమర్శలు గుప్పించారు.

తమ పార్టీ విధానాలతో సంబంధం లేకుండా మోడీ నిర్ణయాన్ని తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ ఎంపీ చెప్పారు. అసలు తమ నాయకుడు చంద్రబాబు సీఎం ల కమిటీకి సారధ్యం వహించడానికి ఎందుకు ఒప్పుకున్నారో తనకు తెలియదని, మోడీ వైఫల్యాన్ని చంద్రబాబు నెత్తిన రుద్దుతారేమో అని తనకు భయం కలుగుతోందని శివప్రసాద్ చెప్పడం విశేషం.

Similar News