T20 World Cup : టీ20 ప్రపంచ కప్ లో భారత్ జట్టు కూర్పు ఇలానే ఉండబోతుందా?

టీ20 వరల్డ్ కప్ కు ఇంకా యాభై రోజుల సమయం ఉంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ నేడు భారత జట్టును ప్రకటించనుంది

Update: 2025-12-20 04:42 GMT

టీ20 వరల్డ్ కప్ కు ఇంకా యాభై రోజుల సమయం ఉంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ నేడు భారత జట్టును ప్రకటించనుంది. టీ20 వరల్డ్ కప్ కు భారత్ జట్టును నడు ప్రకటించనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకుటీ20 వరల్డ్ కప్ స్వ్కాడ్ ను బీసీసీఐ ప్రకటించనుంది. త్వరలోజరగనున్న వరల్డ్ కప్ కు ఆడే భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించనుండటంతో ఎవరిని ఇన్ ఎవరు అవుట్ అన్న టెన్షన్ నెలకొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన టీ20 ప్రపంచ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారన్నదిఆసక్తికరంగా మారింది. ఆతిధ్య హోదాలో భారత్ ఉండటంతో ఐదు నుంచి ఆరుగురిని స్టాండ్ బైలుగా ఉంచే వీలుంది.

ఫామ్ లో లేకపోయినా...
శుభమన్ గిల్ ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడంతో పాటు గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి రెండు మ్యాచ్ ల నుంచి తప్పించింది. అయితే వరల్డ్ కప్ కు కూడా గిల్ కు అవకాశం ఉండకపోవచ్చంటున్నారు. గిల్ ను తప్పించి యశస్వి జైశ్వాల్ లేదా ఇషాన్ కిషన్ కు అవకాశమివ్వనున్నారా? అన్న చర్చ జరుగుతుంద.ి అలాగే జితేశ్ తో పాటు సంజూ శాంసన్ కు కూడా చోటుదక్కనుంది. ఆల్ రౌండర్లుగా హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్ లు ఉండనున్నారు. జస్ప్రిత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు కూడా అవకాశం దక్కనుందని అంటున్నారు. కులదీప్ యాదవ్ కు కూడా చోటు దక్కనుంది. మొత్తం మీద బీసీసీఐ ఎవరి పేరును ప్రకటిస్తుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారనుంది.
ఛాంపియన్ గా నిలబడేందుకు...
అయితే జట్టు నుంచి శుభమన్ గిల్ ను తప్పించే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. జట్టు వైస్ కెప్టెన్ కావడం మాత్రమే కాకుండా కేవలం గాయాల కారణంగానే గిల్ ను సౌతాఫ్రికాతో జరిగిన చివరి రెండు టీ20 మ్యాచ్ లకు దూరం పెట్టామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఫామ్ లో లేకపోవడం సహజమేనని, అయితే గిల్ తిరిగి పుంజుకునే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రపంచ కప్ జట్టులో ఎక్కువ మంది యువ క్రికెరటర్లు ఉండటంతో పాటు సూర్యకుమార్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈసారి కూడా భారత్ టీ20 ప్రపంచ ఛాంపియన్ గా నిలబడేందుకు అన్ని రకాలుగా జట్టు కూర్పు ఉండనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.




Tags:    

Similar News