Gold Price Today : పసిడిప్రియులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల కనిపించింది

Update: 2025-12-20 03:32 GMT

బంగారం మరింత బరువుగా మారుతుంది. వెండి కూడా అదే స్థాయిలో కొనలేని పరిస్థితులు చేరుకున్నాయి. బంగారం, వెండి వస్తువుల కోసం గతంలో ఎగబడి కొనుగోలు చేసే వారు నేడు ఆచి తూచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఐదు గ్రాముల బంగారం కూడా చేతికి రావడం లేదు. ఇక మహిళలు మెడలోనూ, చేతులకు ధరించే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయాలంటే మధ్య తరగతి, వేతనజీవులకు మాత్రం సాధ్యం కావడం లేదు. కేవలం సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఈ రెండు సొంతమవుతున్నాయి. మిగిలిన వర్గాలకు ఇవి దూరమయ్యాయి.

అందరికీ అందుబాటులో
బంగారం అంటే ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది. కొంత మొత్తం అప్పు చేసినా తమ వద్ద ఉన్న డబ్బుతో కొనుగోలు చేసే వీలుండేది. మరొకవైపు జ్యుయలరీ దుకాణాల్లో స్కీమ్ లు కట్టుకుని డబ్బును పొదుపు చేసుకుని దానికి అదనంగా కొంత మొత్తాన్ని చేరిస్తే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. నేడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు సయితం బంగారాన్ని కొనుగోలు చేయలేకపోవడం దాని ధరలు అమాంతం పెరగడమే నని అంటున్నారు. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే 1,30 లక్షల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2.20 లక్షల రూపాయలు దాటేసింది. అందుకే బంగారం, వెండి వస్తువులంటే అందరికీ విరక్తి పుట్టేలా ధరలు పెరుగుతున్నాయి.
నేటి ధరలు...
ఈ ఏడాది వినియోగదారులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు వచ్చే ఏడాది కూడా అదే రేంజ్ లో పెరుగుతాయని అంటున్నారు. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 680 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,34,170 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,20,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News