Delhi : ప్రమాదకరస్థాయికి చేరుకున్న ఢిల్లీ వాయు కాలుష్యం.. బయటకు వస్తే అంతే

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. పొగమంచు చుట్టుముట్టింది.

Update: 2025-12-20 06:36 GMT

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. పొగమంచు చుట్టుముట్టింది. కనుచూపు మేరలో కనిపించడం లేదు. శనివారం ఉదయం ఢిల్లీలో పొగమంచు కమ్ముకోవడంతో అసలు కనిపించడం లేదు. కాలుష్య స్థాయి మరింత పెరగడంతో గాలి నాణ్యత సూచిక 384కి చేరింది. ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం 201–300 మధ్య ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదయింది. అత్యంత దారుణంగా 301–400 ఉంటుంది. తీవ్రమైన ప్రమాదంగా 401–500 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను పరిగనణలోకి తీసుకుంటారు.

రోడ్డు కూడా కనిపించక...
ఉదయం 8.30 గంటల వరకూ సఫ్దర్‌జంగ్‌లో అత్యల్పంగా 200 మీటర్ల దూరం మాత్రమే కనిపించిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పాలంలో 350 మీటర్ల దృశ్యమానత నమోదైంది. తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు, మబ్బు కలిసి కనిపించాయి. ఈ పరిస్థితిని భారత వాతావరణ శాఖముందురోజే అంచనా వేసిందని అధికారులు తెలిపారు. ఇది కాలుష్యం తీవ్రతకు కారణమని నిపుణుల చెబుతున్నారు. అత్యవసరమైతే మాస్కులు ధరించి మాత్రమే బయటకు రావాలని, లేకుంటే వ్యాధులు బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పదహారు కేంద్రాల్లో ప్రమాదకరం...
ఢిల్లీలోని 40 గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో 16 చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్ర స్థాయిలో నమోదయిందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. మిగతా 24 కేంద్రాలుచాలా దారుణం స్థాయిలో ఉన్నాయని, అత్యధికంగా ఐటీవో ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 437గా నమోదైందని చెప్పారు.వచ్చే రెండు రోజుల్లో కాలుష్య స్థాయి మరింత పెరిగే సూచనలు ఉన్నాయని ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంచనా వేసింది. అనుకూలించని వాతావరణ పరిస్థితుల వల్ల ఆదివారం, సోమవారం ‘తీవ్ర’ స్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొంది.
పీసీయూ సర్టిఫికెట్ ఉంటేనే...
కాలుష్యాన్ని నియంత్రించేందుకు బీఎస్-వీ–ఐ ప్రమాణాలకు దిగువగా ఉన్న ఢిల్లీ కాని ప్రైవేట్ వాహనాలపై నిషేధం అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే ‘పీయూసీ లేకుంటే డీజిల్, పెట్రోల్ పోయవద్దంటూ పెట్రోలు బంకులకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్టపికే ఈ నిబంధనను గురువారం నుంచి కఠినంగా అమలు చేస్తున్నారు. సరైన కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం లేకుండా ఏ వాహనానికీ ఇంధనం ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్, డీజిల్ పోస్తున్నారు.














Tags:    

Similar News