Telangana : గచ్చిబౌలిలో ఇళ్లు ఇరవై ఆరు లక్షలే..ఆలస్యం చేస్తే ఆశాభంగమే
పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు ఒక కల. అందులో హైదరాబాద్ వంటి నగరంలో సొంతిల్లు ఉంటే అది చాలు
పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు ఒక కల. అందులో హైదరాబాద్ వంటి నగరంలో సొంతిల్లు ఉంటే అది చాలు. అదీ గచ్చిబౌలిలో ఇల్లు తక్కువ ధరకు లభిస్తే అంతకంటే ఏంకావాలి? అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్యతరగతి ప్రజల కోసం సింగిల్ బెడ్ రూం ఇళ్లను అందుబాటులోకి తెచచింది. సింగిల్ బెండ్ రూం ఇళ్లను తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతాల్లో విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈవేలం ద్వారా ఈ గృహాలను సొంతం చేసుకునే వీలుంది.
గచ్చిబౌలి వంటి ప్రాంతంలో...
ప్రధానంగా హైదరాబాద్ వంటి నగరంలో అదీ గచ్చిబౌలి లో ఒక చిన్న ఇల్లు ఉన్నా చాలు. ఇక జీవితం స్థిరపడిపోయినట్లే. అందుకే లోయర్ ఇన్ కమ్ గ్రూపుల వారి కోసం తీపికబురు చెప్పింది. హైదరాబాద్ తో పాటు ఖమ్మం, వరంగల్ లోని 339 ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ మొత్తంతో ఈ ప్లాట్లను కొనుగోలు చేసే వీలుంది. ఇరవై ఆరు లక్షల నుంచి ముప్ఫయి లక్షలోపు చెల్లించి ప్లాట్ ను సొంతం చేసుకునే వీలుంది. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఈ మేరకు పత్రికల్లోనూ ప్రకటన జారీ చేసింది. అయితే నెలకు యాభై వేల రూపాయలు లోపు ఉన్నవారు మాత్రమే ఈ ఇంటిని సొంతం చేసుకోవడానికి అర్హులు.
తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్మాణంలో...
తెలంగాణ హౌసింగ్ బోర్డు వీటిని నిర్మించింది. ఇందులో ఖాళీగా ఉన్న 339 ప్లాట్లను విక్రయించేందుకు వేలం నిర్వహిస్తుంది. గచ్చిబౌలిలో 111 ప్లాట్లు ఉన్నాయి. వరంగల్ లో 102, ఖమ్మంలో 126 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని, ఇవన్నీ ప్రైమ్ ఏరియాలోనే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అయితేవీటిని కొనుగోల చేయడానికి గడువును కూడా విధించింది. 540 - 620 చదరపు అడుగుల్లో వీటిని నిర్మించారు. ఒక చిన్న కుటుంబానికి ఈ ఇళ్లు సరిపోతాయని,భవిష్యత్ బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
గచ్చిబౌలిలో ప్లాట్ల ధర 26 లక్షల నుంచి 36.20 లక్షలవరకూ నిర్ణయించింది. వరంగల్ లో 19 నుంచి 21.50 లక్షలకు, ఖమ్మంలో 11.25 లక్షలకు మాత్రమే విక్రయించనున్నారు. ఈ ప్లాట్లను సొంతం చేసుకోవాలంటే లక్షరూపాయలు డిపాజిట్ ను చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లోనూ, మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. గచ్చిబౌలి ప్లాట్లను వచ్చే నెల 6వ తేదీ, వరంగల్ ప్లాట్లను జనవరి 8న, ఖమ్మంలోని ప్లాట్లను జనవరి 10న లాటరీ తీస్తారు. లాటరీ లో ఎంపికయిన వారికి మాత్రమే ప్లాట్లను కేటాయించనున్నారు. మరిన్ని వివరాలకు https://tghb.cgg.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చు.