మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం

Update: 2017-12-12 08:38 GMT

నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరేశం వీరంగం మరిచిపోకముందే మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ తమ కుటుంబసభ్యులతో కలిసి వాహనంలో బయలుదేరారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామం వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్దసిబ్బంది ఎమ్మెల్యే వాహనాన్ని ఆపారు.టోల్ ఫీజు చెల్లించమని కోరారు. అయితే తమనే టోల్ డబ్బులు అడుగుతారా? అంటూ ఎమ్మెల్యే గన్ మెన్లు, అనుచరులు సిబ్బందిపై దాడికి దిగారు. ఈ వాహనంలో ఎమ్మెల్యే బొడిగ శోభ భర్త కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News