Gold Prices Today : షాక్ లు మీద షాక్ లు ఇస్తున్న బంగారం.. శాంతించిన వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి
బంగారం, వెండి ధరలు ఒకరోజు పెరుగుతున్నాయి. మరొక రోజు తగ్గుతున్నాయి. తగ్గుతున్నాయని భావించే లోగా భారీగా పెరిగి కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు నిలకడగా సాగడం లేదు. దీంతో కొనుగోలు చేసే వారు కూడా ఒకింత కన్ఫ్యూజన్ లో పడిపోయారు.ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా? అని కొందరు వెయిట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం బంగారం ధర ఎప్పుడూ తగ్గదని, తాము కొనుగోలు చేసిన దానికి నష్టం వచ్చే అవకాశం ఉండదని భావించి కొనుగోలు చేస్తున్నారు.
ధరల పెరుగుదలకు ...
బంగారం, వెండి ధరల పెరుగుదలకు ఒక కారణమంటూ లేదు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కూడా అంతగా పడలేదు. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతాయనుకున్న సమయంలో అది జరగలేదు. మరొకవైపు యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ధరలు ఇంకా తగ్గుతాయని అంచనాలు వినపడుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ధరలు మళ్లీ పెరుగుతుండటంతో కొంత కొనుగోలు దారులు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. బంగారం, వెండి వస్తువులను ధరలతో సంబంధం లేని వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో...
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ధరలు మరింత పెరుగుతాయని ముందుగానే అంచనా వేసి ధరలు తగ్గిన వెంటనే చాలా మంది బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి దారులు మాత్రం మదుపు చేసేందుకు వెనకాడుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,350 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,50,940 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,54,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.