Telangana : మీ బ్యాంకు అకౌంట్ లో నగదు పడిందా? అయితే సరిచూసుకోండి

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతుంది

Update: 2026-04-04 04:40 GMT

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. అందుకే రైతు భరోసా నిధులను వీలయినంత త్వరగా ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను మూడు విడతలుగా జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే తొలి విడత నిధులను జమ చేశారు. ఎకరం భూమికి సంబంధించి ఆరు వేల రూపాయలను ఇటీవల విడుదల చేసింది. మలి విడతగా ఐదు ఎకరాలున్న వారికి రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు.

ఈ నెల రెండో వారంలోనే...
ఈ నెల రెండో వారంలోనే రైతుల ఖాతాల్లో రెండో విడత రైతు భరోసా నిధులను జమ చేయనుంది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకు 2,650 కోట్ల రూపాయలను సిద్ధం చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిధుల సమీకరణ ప్రయత్నంలో ఆర్థికశాఖ అధికారులున్నారు. ఐదు ఎకరాలున్న వారందరికీ రెండో విడత నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పు రైతు భరోసా నిధులను జమ చేస్తున్న సంగతి తెలిసిందే.
మూడు విడతలుగా రైతుభరోసా...
తొలి విడత నిధులను 70 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 3,590 కోట్లు గత నెల 22వ తేదీన జమ చేసింది. అయితే రెండో విడత నిధులను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 9,10 తేదీల్లో విడుదల చేసే అవకాశముందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. మూడు విడతల్లో మొత్తం 9 వేల కోట్లు అవసరం అవుతుందని ప్రభుత్వం నిర్ణయించి మూడు విడతలుగా పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మరోసారి నిధులను విడుదల చేసి రైతులకు తీపికబురుఅందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.


Tags:    

Similar News