Hyderabad : రేపటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు.. ఈ మార్గాన వస్తే చిక్కుకుంటారంతే

ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి

Update: 2026-04-04 12:28 GMT

ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. రేపటి నుంచి మే 22వ తేదీ వరకూ ఉప్పల్ స్టేడియంలో అనేక మ్యాచ్ లు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు.

భారీ ​పోలీస్ బందోబస్తు ..
దాదాపు రెండు వేల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు కోసం నియమించారు. స్టేడియం లోపల మరియు వెలుపల మొత్తం సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంటుంది. వీటిని పర్యవేక్షించడానికి జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాంబు డిస్పోజల్ టీమ్స్ మరియు స్నిఫర్ డాగ్స్ ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి గేటు వద్ద మొబైల్ టెక్నీషియన్లు ప్రేక్షకుల ఫోన్లను తనిఖీ చేస్తారు.
​గేట్ నెం. 1 నుంచి కేవలం ఆటగాళ్లకు మాత్రమే కేటాయించారు. ఇతరులకు ప్రవేశం లేదు.
నిషేధిత వస్తువులు :
​స్టేడియం లోపలికి కొన్ని వస్తువులను తీసుకురావడం నిషేధం విధించారు. ​ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన లోహ/ప్లాస్టిక్ వస్తువులు, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, పెర్ఫ్యూమ్స్, బ్యాగులు, కీ చైన్లు, మండే స్వభావం గల వస్తువులు, పెంపుడు జంతువులు, లేజర్ పాయింటర్లు మరియు బయటి ఆహార పదార్థాలు. ఈవ్-టీజింగ్‌ను అరికట్టడానికి ప్రత్యేక షీ టీమ్స్ అందుబాటులో ఉంటాయి.ఏప్రిల్ 13 నుంచి జరిగే మ్యాచ్‌లకు డిజిటల్ టికెటింగ్ విధానం అమలు చేయనున్నారు.
​ట్రాఫిక్ ఆంక్షలు...
​మ్యాచ్ జరిగే రోజుల్లో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 5న మధ్యాహ్నం 12:నుండి రాత్రి 11:50 వరకు నాగోల్ నుండి హబ్సిగూడ, బోడుప్పల్ నుండి అంబర్‌పేట్ మార్గాల్లో రద్దీ ఉంటుంది.దీంతో వాహనాలను మళ్లించారు. లారీలు, ట్రక్కులు, టిప్పర్లు, ప్రైవేట్ బస్సులు వంటి భారీ వాహనాలకు ఉప్పల్ వైపు ప్రవేశం లేదు.​ఘటకేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను మెహఫిల్ హోటల్ వద్ద నాగోల్ - ఎల్బీ నగర్ వైపు మళ్లిస్తారు. ​ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద మళ్లిస్తారు. ​తార్నాక లేదా హబ్సిగూడ మరియు రామంతాపూర్ వైపు నుండి వచ్చే వాహనాలను నాచారం, చెర్లపల్లి వైపు మళ్లిస్తారు.​వరంగల్ వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్మార్గాన్ని ఎంచుకోవాలి.
​పార్కింగ్ సౌకర్యం:
హబ్సిగూడ వైపు: పెంగ్విన్ గ్రౌండ్స్, టీజీఐఏఎల్ఏ
​రామంతాపూర్ వైపు: డీఎస్ఎల్ ఓపెన్ ప్లేస్, మోడరన్ బేకరీ.
​స్టేడియం లోపల: కేవలం పాస్ ఉన్న వీవీఐపీ/ వీఐపీ వాహనాలకు మాత్రమే (గేట్ 1A ద్వారా) అనుమతి ఉంటుంది.




Tags:    

Similar News