బాబుకు కేవీపీ లేఖ... ఏం రాశారంటే...?

Update: 2017-12-13 12:15 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజ్యసభ సభ్యుడు కేవీపీ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో లాలూచీ పడుతున్నారని లేఖలో కేవీపీ ధ్వజమెత్తారు. హెరిటేజ్ సంస్థను ఫ్యూచర్ గ్రూపుకు విక్రయించినట్లే పోలవరాన్ని కూడా అదే పనిచేస్తున్నారన్నారు. కేంద్రంతో చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. తొలుత చంద్రబాబు, ఆయన సహచరులు పోలవరం కోసం ఢిల్లీ, నాగ్ పూర్ ల చుట్టూ తిరగడం మానుకోవాలని హితవు పలికారు. తాను పోలవరం ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని, కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం సూచించినా కేంద్రం, రాష్ట్రం ఇంతవరకూ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టుపై నిజాలు వెల్లడించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.

Similar News