ప్రియుడు అడ్డంగా దొరికిపోయాడు...!

Update: 2017-12-14 03:53 GMT

సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాతి తన భర్త సుధాకర్ రెడ్డిని అడ్డుతొలగించుకునేందుకు రాజేష్ సాయంతో హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే సుధాకర్ రెడ్డి ప్లేస్ లో తాను రావడానికి ముఖంపై యాసిడ్ పోసుకున్న రాజేష్ ఆస్పత్రిలో నిన్నటి వరకూ చికిత్స పొందుతున్నారు. అయితే బంధువులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది సుధాకర్ రెడ్డి అనే భావించారు. కాలిన గాయాలు తగ్గడం కోసం సుధాకర్ రెడ్డికి ఇష్టమైన మటన్ సూప్ ఇచ్చారు. కాని సుధాకర్ రెడ్డిగా చెప్పుకుంటున్న రాజేష్ మటన్ సూప్ తాగలేదు. రాజేష్ వెజిటేరియన్ కావడంతో మటన్ సూప్ తాగడానికి ఇష్టపడలేదు. దీంతో బండారం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాజేష్ అని తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ ను నాగర్ కర్నూల్ పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు.

Similar News