పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గళం విప్పారు. నోటు కష్టాలపై ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం మరియు భాజపా నేతలు అనుసరిస్తున్న ఉదాసీన, బాధ్యత రహిత ధోరణిని అయన ఎండగట్టారు. ఇళ్ళలో కూర్చుని కబుర్లు చెప్పే కేంద్ర మంత్రులు ఎంపీలు క్యూ లైన్ లలో నిల్చుంటే ప్రజల కష్టాలు తెలుస్తాయని అయన ఎద్దేవా చేసారు.
కర్నూలు లో బ్యాంకు లొనే మరణించిన బాలరాజు కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ప్రధానంగా పవన్ ఫోకస్ బీజేపీ మీదనే సాగడం విశేషం.