తమిళనాడు కోర్టు సంచలన తీర్పు

Update: 2017-12-12 10:56 GMT

తమిళనాడులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. దళిత యువకుడి పరువు హత్య కేసులో ఆరుగురికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. తమ కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించాడని తమిళనాడులో శంకర్ అనే దళిత యువకుడిని కొందరు హత్య చేశారు. ఈకేసులో 11 మందిని అరెస్ట్ చేయగా అందులో ఆరుగురికి తమిళనాడులోని ఉడుమలై పేట జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. యువతి తండ్రి, సోదరుడు ఉరిశిక్ష పడ్డవారిలో ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కోర్టు తీర్పునిచ్చింది. 2016 మార్చిలో శంకర్ ను హతమార్చారు. మిగిలిన అయిదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

Similar News