వైసీపీ అధినేత జగన్ గైర్హాజరు కావడంతో ఆ సమావేశాన్ని చంద్రబాబు వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార కమిషనర్ల నియామకంపై నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు సమావేశం జరగాల్సి ఉంది. దీనిపై వైసీపీ అధినేత జగన్ కు ప్రభుత్వం సమాచారం ఇచ్చారు. సమాచార కమిషనర్ల నియామకంచేసే త్రిసభ్య కమిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల, ప్రతిపక్ష నేత జగన్ ఉన్నారు. అయితే తాను పాదయాత్ర లో ఉన్నందున రాలేనని, తన ప్రతినిధిని పంపుతానని జగన్ సమాచారం పంపారు. అయితే ప్రతినిధిని అనుమతించడానికి నిబంధనలు అంగీకరించవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. తొలుత చంద్రబాబు, యనమల సమావేశమై నియామకాలను చేపట్టాలని నిర్ణయించారు. అయితే చివరిక్షణంలో చంద్రబాబు మనసు మార్చుకున్నారు. సమావేశాన్ని మరోసారి నిర్వహిద్దామని, తేదీని ఖరారు చేసి జగన్ కు తెలపమని అధికారులకు సూచించారు. దీంతో సమాచార కమిషనర్ల నియామక కమిటీ సమావేశం వాయిదా పడింది. ఎప్పుడనేది తేదీ ఖరారు కాలేదు.