చెడ్డీ గ్యాంగ్ ఇలా ఉంటుంది... జాగ్రత్త...!

Update: 2017-12-12 14:10 GMT

చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్‌నగరంలో సంచరిస్తుందని తెలియగానే రాచకొండ కమిషనర్ పోలీసులను అప్రమత్తం చేశారు , రాత్రి వేళలో పోలిస్ గస్తీని తీవ్రతరం చేయాలని , అన్ని కాలనీలలో ప్రజలను అప్రమత్తం చేయాలని , చెడ్డీ గ్యాంగ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని రాచకొండ పోలీసులను ఆదేశించారు . కమిషనర్ ఆదేశాలను అనుసరిస్తున్న క్రమంలో ఘట్ కేసర్ పోలీసులు వివిధ కాలనీలలో సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించగా , పోలిసులకు అన్నోజిగూడలోని మోడీ ఎమరాల్డ్ పార్క్ కాలనీలో చెడ్డీ గ్యాంగుకు ప్రదేశాలకు సంభందించి సీసీటీవీ ఫ్యూటేజ్ లభ్యమయింది, దీనిపై మరింత అప్రమత్తమై రాచకొండ సిసిఎస్ పొలీసులు ఈ గ్యాంగ్ ను పట్టుకొనేందుకు తీవ్రమైన గాలింపు మొదలు పెట్టారు . ఇప్ప టివరకు బెంగళూరు, మహారాష్ట్రల్లో దోపిడీలకు పాల్పడ్డ చెడ్డీ గ్యాంగు తాజాగా మూఁడు కమిషనరేట్ లలో సంచరిస్తుందనటానికి ఆధారాలు లభించాయి.

చెడ్డీ గ్యాంగ్ ను గుర్తుపట్టడం ఇలా....

ఈ గ్యాంగ్‌లో 5-6 లేక 8-10 సభ్యులు ఉన్నారు.

అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లేవారు, ఇండిపెండెంట్ ఇళ్లే ఈ గ్యాంగ్ టార్గెట్

సిసి టీవీ ఫుటేజీలను పరిశీ లించేటప్పుడు ఈ గ్యాంగ్ సభ్యులు ఆయుధాల తో సంచరించడం కనిపించింది.

చెడ్డీ గ్యాంగు సబ్యులు చెడ్డీలు, బనియన్లు ధరించి ముఖానికి ముసుగు వేసుకుంటారు

ముఖ్యంగా నిర్మానుషమైన కాలనీలలో తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తించి దోపిడీ చేస్తారు

చెడ్డి గ్యాంగు మరో పేరు కచ్చా బనియన్ గ్యాంగ్

శరీరానికి ఒండ్రు మట్టి గాని లేడా నూనె రాసుకుని సంచరిస్తారు

పగలు కుర్తా మరియు లుంగీ ధరిస్తారు.

వీరు రైల్వే స్టేషన్లలో , బస్సు స్టాండ్ లలో లేదా కాలనీలలో ఉన్న ఖాళీ ప్లాట్ లలోబస చేస్తారు .

పగలు బిచ్చగాళ్లలాగా లేదా కూలీలలాగా నటిస్తూ కాలనీలలో సంచరిస్తూ తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తిస్తారు

ఒకేరాత్రి రెండు నుంచినాలుగు ఇళ్లను దోచుకుంటారు.

ఒకవేళ ఇంటి సభ్యులు వుంటే వారిని కట్టిపడేస్తారు, ఎదురుతిరిగితే చంపడానికి కూడా వెనుకాడరు.

వీరు సహజంగా కత్తులు, రాడ్లు, బ్లేడ్లు మరియు తుపాకులు తీసుకొస్తారు

వీరు కొన్ని సార్లు దోపిడీచేసిన ఇంట్లో భొజనం చేసి అక్కడే మల విసర్జన చేసి వెళ్తారు

వీరు ఆలయాల్లో కూడా దోపిడి చేశారు

వీరు ఫాసే పార్థి అనే తెగకు చెందినవారు ఈ తెగలు మహారాష్ట్రలో మరియు మద్యప్రదేశ్ లో ఉంటాయి

ఈ తెగకు చెందిన వారు 1999వ సంవత్సరం నుండి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో దోపిడీలు చేశారు .

వీరు ఇంతవరకు చాలా తక్కువగా పట్టుబడ్డారు, చివరిసారి ముంబయి పోలీసు 2016 ఫిబ్రవరి 8వ తేదీన ముంబై లోని బోరవెల్లి లో వీరి పై కాల్పులు జరిపి అరెస్ట్ చెసారు .

Similar News