గుజరాత్ లో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 93 నియోజకవర్గాల్లో తుది విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 14 జిల్లాల్లో 2.23 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం కొంత మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశముందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. మొత్తం 851 మంది అభ్యర్థులు తుది విడత ఎన్నికల బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు.