ఏపీ పారిశ్రామికవేత్త బెంగుళూరులో హత్య

Update: 2016-10-31 03:18 GMT

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పారిశ్రామికవేత్త పరుచూరి సురేంద్ర కుమార్ ను దుండగులు కాల్చి చంపారు. బెంగుళూరులో ఈ ఘోరం జరిగింది. తుపాకులు పెళుతోంటే తొలుత అందరు బాణసంచా పేలుళ్లు గ భావించారు. అయితే ఘోరం జరిగిపోయిన తరవాత గాని విషయం అర్ధం కాలేదు. గతంలో అయన వద్ద మేనేజర్ గా పనిచేసిన వ్యక్తులే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని అంతా అనుకుంటున్నారు.

పరుచూరి సురేంద్ర కుమార్ ఆంధ్ర కు చెందినా పారిశ్రామిక వేత్త. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ పేరుతో అయన స్వచ్ఛంద సంస్థ నడుపుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ తగాదాలు కూడా ఒక కారణం అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

మామూలుగా సురేంద్ర కుమార్ పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్యనే తిరుగుతుంటారు. నిత్యం ఆయన వెంట అరుగురు గన్ మెన్ లు ఉంటారు. ఎప్పుడు మూడు వాహనాల కాన్వోయ్ లో ప్రయాణిస్తుంటారు. అయినా ఆయన బెంగుళూరులోని తన ఆఫీసులో బయల్దేరినప్పటినుంచి పల్సర్ వాహనంలో వెంటాడిన దుండగులు అయన కాల్పులు జరిపి హతమొనర్చారు.

Similar News