Cold Waves : చలికి గడ్డ కట్టిపోతున్న నీరు.. ఎప్పుడూ లేనిది ఈ పరిస్థితి ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు

Update: 2025-12-25 04:27 GMT

దేశంలో చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తర భారతంలో ఎప్పటికంటే చలితీవ్రత ఈసారి ఎక్కువగా ఉంది. భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్లుగానే ఈ ఏడాది చలిగాలుల తీవ్రత కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. చలి దెబ్బకు సొంత పనులు చేసుకోవడానికి కూడా సహకరించని వాతావరణం నెలకొంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా చలితీవ్రత ఎక్కువగా ఉంది. గత పదిహేను రోజుల నుంచి చలిగాలుల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరికొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి దెబ్బకు నీళ్లు కూడా గడ్డకట్టి పోతున్నాయి.

ఏపీలో వణుకు ...
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచుతో గడ్డకట్టి పోతామా? అన్న రేంజ్ లో చలితీవ్రత ఎక్కువగా ఉంది. గతంలో పదేళ్ల నుంచి ఇలాంటి చలి తీవత్ర లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వింత పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని వృద్ధులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నలుమూలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రకృతి పగబట్టినట్లు కొన్ని రోజుల నుంచి చలిగాలుల తీవ్రత వదలడం లేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చలితీవ్రత దెబ్బకు గిరి పుత్రులు ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటలతో వెచ్చదనాన్ని తెచ్చు కుంటున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకూ, సాయంత్రం ఐదు గంటలనుంచి చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది.
తెలంగాణలో అత్యల్పంగా..
తెలంగాణలోనూ చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరికొన్నిరోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఉదయం,సాయంత్రం వేళ అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఈ చలిగాలుల దెబ్బకు రోగాల బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అసలు చలితీవ్రతకు పూర్తిగా విద్యుత్తు వినియోగం పడిపోయింది. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్‌లో 7.8, పటాన్‌చెరులో 8.4 డిగ్రీలు, హైదరాబాద్‌లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News