Gold Price Today : భగ్గుమంటున్న బంగారం.. వామ్మో... వెండి ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగదల కనిపించింది.
బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదు. ప్రతి రోజూ వినియోగదారులకు చుక్కలు చూపుతూనే ఉన్నాయి. ధరలు ఇంతగా పెరుగుతుండటంతో బంగారం మరింత భారమయింది. వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడి పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే లక్షన్నరకు చేరువకాగా కిలో వెండి ధర రెండున్నర లక్షలకు చేరువలో ఉంది. అంటే ఇటీవల కాలంలో బంగారం ధరలు వేల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర కూడా వేల రూపాయల్లో పెరగడం ఆందోళనకు గురి చేస్తుంది. బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న హెచ్చరికలు నిజమవుతున్నట్లే కనిపిస్తుంది. ఈ వారం తగ్గుతాయని చెప్పిన మార్కెట్ నిపుణుల అంచనాలు కూడా నిజం కావడం లేదు.
సీజన్ కాకపోయినా...
బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జ్యుయలరీ దుకాణాల వద్దకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ ధరలను చూసి అటువైపు చూసే వారు కరువయ్యారు. బంగారం, వెండి వస్తువులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నమూనా కావడంతో భారతదేశంలో ఎక్కువ క్రయి విక్రయాలు జరుగుతుంటాయి. అందులోనూ దక్షిణాదిన ఎక్కువ జ్యుయలరీ దుకాణాలు ఉండటానికి ఇక్కడ అమ్మకాలు ఎక్కువ కావడమే. అయితే ఈ రేంజ్ లో ధరలు పెరుగుతుండటంతో ఇక బంగారం కొనుగోలు చేయడం కష్టమేనన్న అభిప్రాయంలోపసిడిప్రియులు పడిపోయారు.
ధరలు పెరిగి...
మరొకవైపు ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా కాదు. కేవలం పండగ సీజన్ మాత్రమే. ఈ సీజన్ లో ధరలు సహజంగా నెమ్మదిస్తుంటాయి. అయినా ధరలు ప్రతిరోజూ పెరుగుతుండటం ఆందోళనకరంగా ఉంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,27,360 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 138,940 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,44,100 రూపాయలుగా ట్రేడ్ అయింది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరగొచ్చు.