Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి అలెర్ట్.. ఒకరోజు దర్శనానికి వెయిట్ చేయాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ బాగా ఉంది

Update: 2025-12-25 03:27 GMT

తిరుమలలో భక్తుల రద్దీ బాగా ఉంది. వరసగా సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. నేడు క్రిస్మస్ సందర్భంగా సెలవు, రేపు ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే వరసగా నాలుగు రోజులు సెలవు దినాలు వస్తాయని భావించి అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలేశుని చెంతకు చేరుకుని భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ విస్తరించిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

రద్దీ మామూలుగా లేదుగా...
సహజంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రద్దీ ఈ సారి మాత్రం మంగళవారం నుంచి ప్రారంభమయింది. ధనుర్మాస ఉత్సవాలు జరుగుతుండటం, ధనుర్మాసంలో తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుంటే పుణ్య ప్రదమని ఎక్కువ మంది భక్తులు భావిస్తారు. అందుకే అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక ఈ నెల 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండటంతో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని, తిరుమల భక్తులతో కిటకిటలాడిపోతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,524 మంది భక్తులు దర్శించు కున్నారు. వీరిలో 29,989 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.88 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.













Tags:    

Similar News