Telangana : తెలంగాణలో మరో ఉప ఎన్నిక సిద్ధం.. దానం సిద్ధమవుతున్నారా?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమయ్యారు

Update: 2025-12-24 12:07 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే కొద్దిరోజుల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనపడుతుంది. అందుకే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందన్నారు. మూడు వందల డివిజన్లలో ఎంఐఎం, కాంగ్రెస్ కలిపి అత్యధిక స్థానాలను చేజిక్కించుకుంటామని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీనేనని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ 2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేశారు.

అనర్హత పిటీషన్ ఉన్న సమయంలో...
ఆయనపై బీఆర్ఎస్ అనర్హత పిటీషన్ వేసింది. దీంతో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుందని భావిస్తున్న సమయంలో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో దానం నాగేందర్ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసి తాను బీఆర్ఎస్ కాదని స్పష్టం చేశారు. మూడు వందల డివిజన్లలో పర్యటించి తాను కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేస్తానని దానం నాగేందర్ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ఆయన తాను కాంగ్రెస్ లో ఉన్నానని స్పష్టం చేయడంతో తాను రాజీనామాకు రెడీ అని చెప్పకనే చెప్పారు.
వేటు పడక ముందే...
కాంగ్రెస్ బీఫారం మీద పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటు పడకముందే తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమయినట్లు కనిపిస్తుంది. ఇందుకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయంగా రావడం కనిపిస్తుంది. అయితే ఎప్పుడు రాజీనామా చేసినా ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే స్పీకర్ కు కూడా అనర్హత పిటీషన్ పై దానం నాగేందర్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.రాజీనామా చేసే సమయంలో ఇక వివరణ ఇవ్వడం ఎందుకు అని ఆయన స్పీకర్ కు ఎటువంటి లేఖ అందచేయలేదు. స్పీకర్ అనర్హత వేటు వేయకముందే దానం నాగేందర్ రాజీనామా చేస్తారన్నది వాస్తవం. అది మరికొద్దిరోజుల్లోనే జరగనుంది. దీంతో హైదరాబాద్ నగరంలో మరొక ఉప ఎన్నిక రావడం ఖాయం.




Tags:    

Similar News