Murder Case : భర్తను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. దొరికిపోయిన భార్య

వివాహేతర సంబంధం భర్తను దారుణంగా భార్య హత్య చేసిన ఘటన తెలంగాణలో జరిగింది

Update: 2025-12-25 04:44 GMT

వివాహేతర సంబంధం భర్తను దారుణంగా భార్య హత్య చేసిన ఘటన తెలంగాణలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గృహరుణాన్ని మాఫీ పొందాలనే ఆశతో పాటు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలనే ఉద్దేశంతో ఓ మహిళ తన ప్రియుడు, మరొక వ్యక్తి సహకారంతో భర్తనే హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేసముద్రం పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని బోడమంచతండా శివారులో భూక్య ఈరన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో ఇది పక్కా హత్యగా తేలింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

గృహరుణం మాఫీ కావాలని...
మహబూబాబాద్ పోలీసుల కథనం ప్రకారం, మృతుడు భూక్య ఈరన్న భార్య భూక్య విజయకు మరియు అదే తండాకు చెందిన బోడబాలోజీకి కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఈరన్న తన వ్యవసాయ భూమిని అమ్మి కొంత అప్పు తీర్చినా, ఇంకా బాకీలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోడబాలోజీ, అతని స్థలంలో కిరాయికి ఉండే ఆర్ఎంపీ వైద్యుడు ధర్మారపు భరత్ సహాయంతో ముత్తూట్ సంస్థలో హౌస్ లోన్ ఇప్పించారు. లోన్ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతి చెందితే లోన్ మాఫీ అవుతుందని తెలిసిన నిందితులు, ఈరన్నను హత్య చేసి ప్రమాదంగా చూపించాలని కుట్ర పన్నారు.
మద్యం తాగుదామని రమ్మని...
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ నెల 22వ తేదీన రాత్రి మద్యం తాగుదామని చెప్పి ఈరన్నను తండా బయట ఉన్న తూము పామాయిల్ తోట వద్దకు పిలిచారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం బోడబాలోజీ ఇనుప రాడ్డుతో ఈరన్న తల వెనుక బలంగా కొట్టగా, కిందపడిన అతడిని ధర్మారపు భరత్ టవల్‌తో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. హత్య అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బెరువాడ వెళ్ళు రోడ్డుపక్కన తూము సాయి దినేష్ పొలంలో మృతుడిని అతని మోటార్ సైకిల్‌తో సహా పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

.









Tags:    

Similar News