Revanth Reddy : నేను రాజకీయాల్లో ఉన్నంత వరకూ కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను

పదేళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2025-12-24 11:53 GMT

పదేళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కోస్గిలో జరిగిన సర్పంచ్ లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను తానేమీ అనలేదని, తాను ఆయనపై కేసులు పెడతానని కూడా చెప్పలేదన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. పాలమూరు ప్రజలు పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురయ్యారని రేవంత్ రెడ్డి చెప్పారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్పారు. తనను జైలుకు పంపాడని, తన కుటుంబ సభ్యులను వేధించాడని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరి తోలు తీస్తావో చూద్దాం రా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రెండేళ్లలో ఫామ్ హౌస్ లో తోలు తీసుడు కార్యక్రమాన్ని నేర్చుకున్నాడన్నారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీగా అయ్యారన్న కేసీఆర్ రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారని తెలిపారు. ఆయన పాపాలకు ఆయనే పోతాడని నేనేమీ అనలేదన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మంచం మీద పడి మక్కెలిరగొట్టుకున్నారని కేసీఆర్ అన్నారు.

దుబాయ్ పాస్ పోర్టు బ్రోకర్ పనిచేయలే...
తాను కేసీఆర్ లా దుబాయ్ పాస్ పార్ట్, బ్రోకర్ పనిచేయలేదని కేసీఆర్ చెప్పారు. చింతమడకలో చీరీ చింతకు కడతామని రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు - రంగారెడ్డి, తుమ్మిళ్ల, నెట్టెంపాడు ప్రాజెక్టులను పదేళ్ల పాటు పూర్తి చేయలేకపోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ దందాతాను చేయడం లేదన్నారు. తోలు తీస్తా.. తాట తీస్తా అంటూ హెచ్చరిస్తావా.. మీ అయ్య పేరు చెప్పుకుని బతికేటోడివి నువ్వు నా అంతుచూస్తావా? అని కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో 80కి పైగా స్థానాలను సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. ఇది కేసీఆర్, కేటీఆర్ లకు సవాల్ అని రేవంత్ రెడ్డి అన్నారు. లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి కమీషన్లను దండుకుంటున్నారని అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకూ కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉండేది కల అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ వయసుకు, అనుభవానికి గౌరవిస్తామని, ధైర్యముంటే ఈ నెల 29వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ సవాల్ విసిరారు.



















Tags:    

Similar News