RRB : రైల్వేలో జాబ్ కొట్టాలనుకుంటున్నారా? ...నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-12-25 05:02 GMT

రైల్వేశాఖలో ఉద్యోగం వచ్చిందంటే బపర్ ప్రైజ్ లభించినట్లే. మంచి జీతం. అన్ని సదుపాయలు ఉన్న ఉద్యోగంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో రైల్వే ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ. అయితే రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 22 వేల ఉద్యోగాలను ఒకే ఒక నోటిఫికేషన్ తో భర్తీ చేయనుంది. వీటిలో గ్రూప్ డి లెవెల్ ఉద్యోగాలు అన్నీ. ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారికి నెలకు పద్దెనిమిది వేల రూపాయల జీతంతో పాటు అలవెన్సుల రూపంలో దండిగా సొమ్ములు తమ బ్యాంకు ఖాతాల్లో నెలవారీ వచ్చి పడతాయి.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో...
దేశంలో వివిధ రైల్వే శాఖ రీజియన్ లలో ఖాళీగా ఉన్న గ్రూప్ డి ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ట్రాక్ మెయిన్ టైనర్, పాయింట్ మెన్, బ్రడ్జి, ట్రాక్ మెషిన్, లోకో షెడ్ విభాగాల్లో అసిస్టెంట్ల పోస్టులను భర్తీకి ఈ నోటఫికేషన్ ను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. అయితే ఇందుకు పెద్దగా విద్యార్హత కూడా అవసరం లేదు. పదో తరగతి తత్సమానమైన విద్యార్హత ఉంటే చాలు. ఐటీఐ చదివిన వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఆర్.ఆర్.బి. నిర్ణయించింది.
కొత్త ఏడాదిలోనే...
అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జనవరి ఒకటోతేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేస్తుకోవచ్చు. ఫిబ్రవరి 20వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థుల వయోపరిమితి దరఖాస్తు చేసుకునే సమయానికి పద్దెనిమిది నుంచి ముప్ఫయి మూడు సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలతో పాటు అన్ని వివరాలు దరఖాస్తు ఫారంలో పొందుపర్చాలి. ఎంపిక విధానం, అప్లికేషన్ ఫీజు ఇతర వివరాల కోసం నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత చసుకోవచ్చు. ఆధార్ కార్డు నెంబరుతో పాటు పుట్టిన తేదీ, పదోతరగతి సర్టిఫికేట్ తో పాటు పాస్ పోర్టు సైజ్ ఫొటో దరఖాస్తుతో పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.


Tags:    

Similar News