Delhi : ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందంటే?

ఢిల్లీలో వాయు కాలుష్యం కొద్దిగా తగ్గింది.

Update: 2025-12-25 06:13 GMT

ఢిల్లీలో వాయు కాలుష్యం కొద్దిగా తగ్గింది. గురువారం ఉదయం కాలుష్య గాలులు లేకుండా కనిపించాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం గాలి నాణ్యత సూచిక 220గా నమోదై ‘పూర్’ స్థాయిలో నిలిచింది. సీపీసీబీ ‘సమీర’ యాప్ సమాచారం ప్రకారం రాజధానిలోని 29 పర్యవేక్షణ కేంద్రాల్లో గాలి నాణ్యత ‘పూర్’ స్థాయిలోనే ఉంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 308గా నమోదుై ‘వెరీ పూర్’ స్థాయిలోకి చేరింది. మిగతా కేంద్రాల్లో ‘మోడరేట్’ స్థాయిలో కనిపించింది. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఢిల్లీలో ఉంటే శరీరంపై దుద్దుర్లు వస్తున్నాయని అనడం దేశ వ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్...
సీపీసీబీ వర్గీకరణ ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0–50 ‘గుడ్’, 51–100 ‘సంతృప్తికరంగా’, 101–200 ‘మోడరేట్’, 201–300 ‘పూర్’గా, 301–400 ‘వెరీ పూర్గా’, 401–500 గా‘సీవియర్’గా పరిగణిస్తారు. బుధవారం కూడా 24 గంటల సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ‘పూర్’ స్థాయిలోనే నమోదైంది. అయితే మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 412కి చేరి ‘సీవియర్’ స్థాయికి దిగజారింది. అక్కడి నుంచి ఇది గణనీయంగా మెరుగుపడినట్టు సీపీసీబీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాయు కాలుష్య తీవ్రతతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతకొద్ది రోజులుగా ఇదే పరిస్థితి.
మళ్లీ పెరగనున్నట్లు...
అయితే ఈ ఊరట ఎక్కువకాలం ఉండకకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో గాలి నాణ్యత మళ్లీ క్షీణించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఉపరితల గాలివేగాలు గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల మధ్య నమోదుకావడం వల్ల కాలుష్యం తగ్గిందని సీపీసీబీ పేర్కొంది. వాతావరణం విషయానికి వస్తే ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ. గరిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం మోస్తరుగా ఉంటుందని అంచనా వేసింది. ఢిల్లీ వాసులు బయటకు వస్తే మాస్క్ లు పెట్టుకోవాల్సిందేనని సూచించింది. వాయు కాలుష్యం ప్రభావంతో ఢిల్లీకి పర్యాటకుల సంఖయ కూడా ఇటీవల తగ్గిందని అంటున్నారు.









Tags:    

Similar News