Tamilnadu : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మరణించారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మరణించారు. బస్సు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు రెండు కార్లను ఢీకొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం తమిళనాడులోని కడలూరు జిల్లా ఎళుత్తూరు జాతీయ రహదారిపై జరిగింది. తిరుచ్చి నుంచి చెన్నైకు వెళుతున్న తమిళనాడు ఆర్టీసీకి చెందిన బస్సు ఈ ప్రమాదానికి గురయింది. బస్సు టైర్ పేలడంతో వరసగా రెండు కార్లను వేగంగా ఢీకొట్టింది.
బస్సు టైరు పేలడంతో...
బస్సు టైరు పేలడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి అవతలివైపు వెళుతున్న రెండు కార్లపై డింది. వాటిలో ఉన్న తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. కారులో ప్రయాణిస్తున్న వారు ఎవరన్నది ఇప్పటి వరకూ తెలియరాలేదు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహకారంతో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో
తమిళనాడు ఆర్టీసీ బస్సుకు సంబంధించి టైర్ పేలడంతో పాటు జాతీయ రహదారి కావడంతో వేగంగా వస్తున్నందున అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని అవతలి వైపు పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారులో ఉన్న వారితో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.