ఏపీ కేబినెట్ తీర్మానాలు.. సమగ్రంగా ఇవే

Update: 2016-11-15 19:53 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం అమరావతిలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కేబినెట్ భేటీ నిర్ణయాలను మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. సమగ్రంగా.. కేబినెట్ భేటీలో తీసుకున్న మొత్తం నిర్ణయాలు ఇవీ...

వ్యవసాయ శాఖ :

1.డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ప్రైవేట్ కళాశాలలను గుర్తించడం కోసం విశ్వవిద్యాలయాల చట్టం, 2007కు సవరణ ప్రతిపాదిస్తూ మంత్రిమండలి ఆమోదం.

2.రాయలసీమలోని 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాలో అనావృష్టి నివారించి రైతుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయ అంచనా రూ.1149 కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వ ఎక్స్‌టెర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల కింద చేపడతారు. లక్షా 65 వేల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. వారి ఆదాయాన్ని పెంచి అనావృష్టి పరిస్థితులను తట్టుకోగల శక్తిని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈఏపీ రీపేమెంట్ కేంద్రమే చేస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అమలుచేస్తాం.

6.దేవాదాయ, ధర్మాదాయ శాఖ :

కృష్ణా జిల్లాలోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన భూమిలో 14.20 ఎకరాలను సిద్ధార్థ అకాడమీకి లీజు ధర స్థిరీకరణ. ఎకరాకు రూ.లక్షన్నర చొప్పున ఏడాదికి లీజు. మూడేళ్లకు ఒకసారి 5శాతం పెంపుదల.

7) మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ :

భారత ప్రభుత్వం లక్షా 93,147 ఇళ్లు రాష్ట్రానికి మంజూరు చేయగా, వాటిలో లక్షా 20వేల 106 ఇళ్లు APTSIDCO నిర్మిస్తుంది. మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చేపట్టనుంది.

రూ.1801.60 కోట్లతో లక్షా 20 వేల106 గృహాల నిర్మాణం.

మిగిలిన సొమ్మును హడ్కో నుంచి రుణంగా తీసుకోవాలని APTSIDCOకు సూచన.

ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద చేపట్టే గృహనిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1800 కోట్లు.

రాష్ట్ర ప్రభుత్వం తన సబ్సిడీ వాటాగా ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల కేటాయిస్తుంది.

8) మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ:

రాష్ట్ర, జిల్లా, డివిజనల్, యుఎల్‌బి, మండల్, పంచాయతి స్థాయుల్లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.

రాష్ట్రస్థాయి నుంచి పంచాయతి స్థాయి వరకు స్వచ్ఛంధ్రప్రదేశ్ మిషన్ అమలు.

ఈ మిషన్ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారు. వైస్ చైర్మన్లుగా పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గృహనిర్మాణశాఖల మంత్రులు వ్యవహరిస్తారు.

9). మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ:

విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VUDA) ల్యాండ్ పూలింగ్ స్కీమ్-2016 కింద వ్యక్తిగత భూసమీకరణ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం.

10. మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (CRDA):

239 ఎకరాల భూమిని 3 సంస్థల కేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం.

1. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ భూమి (crda) అమృత యూనివర్శిటీకి 200 ఎకరాలు (150 ఎకరాలు ఫేజ్-1, 50 ఎకరాలు ఫేజ్-2)

2. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 11 ఎకరాల కేటాయింపు. ఇందులో కార్యాలయ భవనాలకు 5 ఎకరాలు, నివాస భవనాల కోసం 6 ఎకరాల కేటాయింపు

3. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్‌కు 28 ఎకరాలు. (కార్యాలయాలకు 11, రెసిడెన్సియల్‌కు 17 ఎకరాలు). ఆయా పార్టీలతో మాట్లాడి ధర నిర్ణయిస్తారు.

11) ఐటీ, ఇన్వెస్టిమెంట్ శాఖ :

కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్‌మెంట్ బాక్సుల కొనుగోలుకు బ్యాంకుల నుంచి రుణంగా రూ.300 కోట్లు తీసుకోవటానికి ప్రభుత్వ గ్యారంటీ. స్టేట్ ఫైబర్‌నెట్ వడ్డీతోపాటు, రుణ వాయిదాలను చెల్లిస్తుంది.

13) ఆర్ధికశాఖ :

అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాల కోసం బోధనా సిబ్బంది 13 మంది, బోధనేతర సిబ్బంది 19 మంది ఏర్పాటుకు మంత్రిమండలి అనుమతి మంజూరు.

14) ఆర్ధిక శాఖ :

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఐటిఐ కళాశాల పూర్తి ప్రాతిపదికన 16 పోస్టులు మంజూరు.

15) ఆర్ధిక శాఖ :

డైరెక్టర్ డి& అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖలలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో 210 మంది జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రెడేషన్ చేయటానికి మంత్రివర్గం అనుమతి

16) ఆర్ధిక శాఖ :

తిరుపతి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో డెయిరీ టెక్నాలజీ కోసం నలుగురు బోధన సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించటానికి అనుమతి మంజూరు.

17. ఆర్ధిక శాఖ :

విభజనానంతర ఏపీలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయానికి కేటాయించిన ఏసీటీఓలు-16, డిసిటివో-6 పోస్టులను సూపరింటెండెంట్ గ్రేడ్-1 (గెజిటెడ్), 16 పోస్టులను సూపరింటెండెంట్స్ పోస్టులుగా మార్చడానికి అనుమతి.

18. ఆర్ధిక శాఖ :

కోస్తా ఆంధ్ర ప్రాంత జైళ్ల శాఖ డీఐజీ పోస్టును ఐజీగా (31.05.2017 వరకు) అప్‌గ్రేడ్ చేయటానికి అనుమతి.

19. పరిశ్రమల శాఖ :

విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని APSEZ లోని ప్లాట్ నెంబర్ 26 సి (పార్ట్) 26-డి(పార్ట్)60 ఎకరాల భూమిని ఎల్.పి.జి బాటిలింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు కేటాయించేందుకు అనుమతి. ఎకరాకు రూ.40లక్షల చొప్పున ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం.

ఈ నెలాఖరులోగా పల్స్ సర్వే పూర్తిచేయాలని మంత్రిమండలి నిర్ణయం.

ప్రతి మంత్రిమండలి సమావేశంలో అగ్రిగోల్డ్ అంశంపై సమీక్షించాలని నిర్ణయం.

Similar News