Andhra Pradesh : ఏపీ సర్కార్ సూపర్ న్యూస్.. మహిళలకు ఉచితంగా పదిహేను వేలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద నిధులను మంజూరు చేసింది. అయితే ఈ రివాల్వింగ్ ఫండ్ మాత్రం కొత్తగా ఏర్పాటయిన డ్వాక్రా సంఘాలుకు మాత్రమే అందుతుంది. చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను తన కలల ప్రాజెక్టుగా భావిస్తారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు చేయూతనిస్తుంటారు. మహిళలు మరింతగా రాణిస్తే రాష్ట్రంతో పాటు అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని ఆయన భావించి తొలి నుంచి డ్వాక్రా గ్రూపు సంఘాలను ఆయన ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా రివాల్వింగ్ ఫండ్ సక్రమంగా డ్వాక్రా సంఘాలకు చేరలేదు.
మూడు కోట్లు విడుదల చేసి...
అయితే తాజాగా కూటమి ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద డ్వాక్రా సంఘాలకు మూడు కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా నిధులను కూడా విధులను చేసింది. ఒక్కొక్క సంఘానికి పదిహేను వేల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభు్తవం చెల్లిస్తుంది. అయితే ఈ నిధులు మాత్రం కేవలం కొత్తగా ఏర్పాటయిన డ్వాక్రా సంఘాలకే అందుతాయి. 2024 ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ ఏడాది నవంబరు 30వ తేదీ లోపు డ్వాక్రా సంఘాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. నిజంగా ఇది మహిళా సంఘాలకు తీపికబురేనని చెప్పాలి.
తక్కువ వడ్డీకే...
డ్వాక్రా సంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తుంది. మహిళ సంఘాలను ప్రోత్సహించడానికే ఈ నిధులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మరిన్ని డ్వాక్రా సంఘాలు ఏర్పాటయ్యేలా ఈ రివాల్వింగ్ ఫండ్ దోహదపడుతుందని ప్రభుత్వం కూడా అంచనా వేస్తుంది. ఈ మహిళా సంఘాలు తమ స్వయం కృషితో నిలదొక్కుకోవడమే కాకుండా తమ కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు. ఉపాధికి సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించవచ్చు. చిరు వ్యాపారాలు చేసుకుని మహిళలు తాము ఎదగడమే కాకుండా సమాజానికి కూడా కొంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ మేరకు డ్వాక్రా సంఘాలకు చేయూత నిచ్చేలా చర్యలు ప్రారంభించింది.