తనంతట తానే దొరికిపోతే తప్ప.. పోలీసులు పట్టుకోలేకపోతున్నారా?

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ చిక్కే అవకాశాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి

Update: 2025-12-22 06:21 GMT

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ చిక్కే అవకాశాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు.మూడు గడుస్తున్నా ఇంకా బత్తుల ప్రభాకర్ ఆచూకీ పోలీసులకు లభ్యం కాలేదంటే బత్తుల ప్రభాకర్ ఏ రేంజ్ లో పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. బత్తుల ప్రభాకర్ కోసం పోలీసు బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. అసలు బత్తుల ప్రభాకర్ తప్పించుకున్న విషయాన్ని పోలీసులు కూడా మర్చిపోయినట్లు నటిస్తున్నట్లుంది. ఉన్నతాధికారుల నుంచి పోలీసుల వరకూ బత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. అలాగని బత్తుల ప్రభాకర్ కోసం గాలింపు చర్యలను నిలుపుదల చేయలేదు.

ఏపీ పోలీసులకు సవాల్...
పోలీసులకు బత్తుల ప్రభాకర్ ను పట్టుకోవడం సవాల్ గా మారిందనే చెప్పాలి. బత్తుల ప్రభాకర్ ఎస్కార్ట్ పోలీసుల నుంచి సెప్టంబరు 22వ తేదీన తప్పించుకున్నాడు. నేటికి మూడు నెలలు గడుస్తున్నా బత్తుల ప్రభాకర్ ను పోలీసులు పట్టుకోలేకపోతున్నారంటే అతని క్రిమినల్ మైండ్ ను అర్థం చేసుకోవచ్చు. బత్తుల ప్రభాకర్ ను తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఒక హోటల్ వద్ద భోజనం చేయడానికి ఆగడంతో టాయ్ లెట్ కు వెళతానని చెప్పి బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. గతంలోనూ బత్తుల ప్రభాకర్ తప్పించుకుని మూడేళ్ల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అసలు బత్తుల ప్రభాకర్ జాడ ఎక్కడ ఉందో కూడా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన సమయంలోనూ..
సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా విస్తరించిన సమయంలోనూ పోలీసులకు బత్తుల ప్రభాకర్ ఒక సవాల్ గా మారాడని చెప్పాలి. బత్తుల ప్రభాకర్ తనంతట తాను ఏదో ఒక నేరం చేస్తూ ఆయాచితంగా దొరకాలే తప్పించి పోలీసులు పట్టుకోవడం మాత్రం జరిగే అవకాశం లేదన్నది మూడు నెలల నుంచి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అదే చెప్పాలని పిస్తుంది. క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పై తమిళనాడు, కర్ణాటకలో దాదాపు నలభైకి పైగానే కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 42 కేసులు నమోదయి ఉన్నాయి. బత్తుల ప్రభాకర్ దొరకుతాడన్న నమ్మకం సన్నగిల్లింది. ఆ నేరగాడు ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకున్నామని పోలీసులు చెప్పుకోవాల్సిందే తప్ప బత్తులోడు దొరకడంటే దొరకడు. ఇది యదార్థం.



Tags:    

Similar News