Bigg Boss 9 : బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగిసింది. విన్నర్ గా కల్యాణ్ పడాల నిలిచాడు

Update: 2025-12-22 02:22 GMT

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగిసింది. విన్నర్ గా కల్యాణ్ పడాల నిలిచాడు. చివరి వరకూ ఇద్దరి మధ్య పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. తనూజ, కల్యాణ్ ల మధ్య ట్రోఫీ దోబూచులాడింది. అయితే కామనర్ గా హౌస్ లోకి ప్రవేశించిన కల్యాణ్ పడాల బిగ్ బాస్ 9 సీజన్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. గత పది హేను వారాల నుంచి అంటే 105 రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఈ సీజన్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అగ్నిపరీక్షలో కామన్ మ్యాన్ గా అడుగు పెట్టిన కల్యాణ్ పడాల టాస్క్ లు ఆడుతూ, ప్రేక్షకుల ఆదరణ పొంది వారి ఓట్లతోనే ఈ ట్రోఫీని చేజక్కించుకున్నాడు. సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న తనూజ రన్నర్ అప్ గా మిగిలింది.

వరసగా ఎలిమినేట్ అవుతూ...
టాప్ 5లో కల్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజన, డీమాన్ పవన్ ఉన్నారు. అయితే ఆదివారం ఎపిసోడ్ లో ఒక్కొక్కరిని హౌస్ నుంచి తప్పిస్తూ వచ్చారు. తొలుత సినీనటుడు శ్రీకాంత్ హౌస్ లోకి వచ్చి సంజనను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ చేశారు. దీంతో ఇక హౌస్ లో నలుగురు మాత్రమే మిగిలారు. తర్వాత హౌస్ లోకి వచ్చిన మరొక సెలబ్రిటీ నవీన్ పొలిశెట్టి హౌస్ లోకి వచ్చి రోబోతో వెళ్లి ఇమ్మాన్యుయేల్ ను ఎలిమినేట్ చేశాడు. ఇమ్మాన్యుయేల్ హౌస్ నుంచి టాప్ 3 నుంచి లేకుండా ఎలిమినేషన్ కావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఎందుకంటే తొలి నుంచి టాస్క్ లతో పాటు హౌస్ తో పాటు తెలుగు ప్రేక్షకులను నవ్వుల పూయించిన ఇమ్మాన్యుయేల్ త్వరగా ఎలిమినేట్ కావడం కొంత ఇమ్మూ అభిమానులకు నిరాశ ఎదురయింది.
ఇరవై లక్షలు తీసుకుని డీమాన్ పవన్...
ఇక హౌస్ లో మిగిలిన ముగ్గురు హౌస్ మేట్స్ నుంచి హీరో రవితేజ సూట్ కేసుతో హౌస్ లోకి వెళ్లాడు. ముగ్గురిలో ఎవరు తనతో బయటకు వచ్చినా తన సూట్ కేసులో ఉన్న ఐదు లక్షలు ఇస్తానని చెప్పాడు. అందుకు ఎవరూ అంగీకరించలేదు. చివరకు ఆ మొత్తాన్ని 20 లక్షలకు పెంచాడు. దీంతో డీమాన్ పవన్ తన కుటుంబానికి డబ్బు అవసరముందని చెప్పి ఆ సూట్ కేసు అందుకున్నాడు. కానీ నిజానికి తర్వాత డీమాన్ పవన్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. చివరకు మిగిలిన కల్యాణ్ పడాల, తనూజలకు ఇరవై లక్షలు నాగార్జున ఆఫర్ ఇచ్చినా తీసుకోలేదు. చివరకు కల్యాణ్ పడాలను విన్నర్ గా ప్రకటించారు. విన్నర్ ప్రైజ్ మనీ 35 లక్షల తోపాటు మారుతి సుజుకీ కారు, మరొక ఐదు లక్షల రూపాయలను కల్యాణ్ అందుకున్నాడు.


































Tags:    

Similar News