Gold Rates Today : ఈ వారం బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు పడిపోతాయట

నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగానే పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది

Update: 2025-12-22 03:33 GMT

బంగారం ధరలు భయపెడుతూనే ఉంటాయి. అయితే కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ భయం ఉంటుంది. శుభకార్యాలు చేసుకునే వారు మాత్రమే బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి.. మామూలుగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం పెద్దగా ధరలను పట్టించుకోవడం లేదు. అంటే అసలు బంగారం అనే వస్తువు ఒకటి ఉందన్న విషయం కూడా మర్చిపోయినట్లున్నారు. ఎందుకంటే ఈ స్థాయిలో ధరలు పెరగడంతో ఇక బంగారం మనకు అందుబాటులోకి రాదని చాలా మంది ఫిక్సయిపోయారు. కేవలం మధ్యతరగతి, వేతనజీవులు మాత్రమే కాదు.. లక్షల్లో సంపాదించే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడం లేదు.ఈ వారంలో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశముందని అంటున్నారు.

సీజన్ కాకపోయినా...
గతంలో పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కాకపోయినా పుట్టిన రోజులు, పెళ్లి రోజులు అని పేరు చెప్పి బంగారాన్ని కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు బంగారం బహుమతిగా ఇవ్వడం, అందుకోవడం కూడా కష్టమే. అందుకే బంగారం వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. తమకు నచ్చిన డిజైన్లు ఈ కళ్లు చూశాయంటే వాటిని కొనుగోలు చేయాలని మనసు పరివిధాలుగా పోతుందని భయపడి అసలు దుకాణాల్లో కాలు మోపేందుకు కూడా ఆసక్తి కనపర్చడం లేదు. దీంతో జ్యుయలరీ దుకాణాలను వినియోగదారులు లేక వెలవెల బోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఇటీవల కాలంలో భారీగా పెరగడంతో ఈ రెండు వస్తువుల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని అంటున్నారు.
నేటి ధరలు...
ఇక పెట్టుబడులు పెట్టేవారు అయితే బంగారం కంటే వెండిపైనే ఎక్కువ పెడుతున్నారంటున్నారు. అందుకే కొద్దో గొప్పో బంగారం కంటే వెండిని కొనుగోలు చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువయింది. నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగానే పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,22,990 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 1,34,170 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,25,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News