Team India : టీంఇండియా ఛాంపియన్ గా గెలవాలంటే.. ఈ జట్టుతో సాధ్యమేనా?

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది

Update: 2025-12-22 04:37 GMT

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అందులోనూ భారత్ పై జరుగుతుండటంతో డిఫెండింగ్ ఛాంపియన్ గా మరొకసారి కప్పు చేజిక్కించుకోవాలన్న కసితో టీం ఇండియా ఉంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టు కూర్పును చూస్తే ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్పించి అందరూ యువఆటగాళ్లే. హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా వంటి అనుభవమున్న వాళ్లు కూడా ఉండటంతో జట్టు కూర్పు అదిరిందనే చెప్పాలి. ఆసియా కప్ లో దాదాపు ఇదే జట్టు ఛాంపియన్ గా నిలిచింది.

పదిహేను మంది సభ్యులతో...
పదిహేను మంది సభ్యులతో కూడిన భారత టీ20 జట్టును ప్రకటించింది. అయితే రిజర్వ్ ప్లేయర్లను ప్రకటించలేదు. అయితే సొంతగడ్డపై ప్రపంచ కప్ జరుగుతుండటంతో గాయపడిన ఆటగాళ్ల స్థానంలో కొత్త ప్లేయర్ ను ఇబ్బంది చేసే వీలుంది. శుభమన్ గిల్ ను కూడా పక్కన పెట్టడం సరైన చర్యగా అందరూ అభిప్రాయపడుతున్నారు. శుభమన్ గిల్ వరసగా పేలవ ప్రదర్శన చేయడంతో వైస్ కెప్టెన్ అయినప్పటికీ పక్కన పెట్టడం మంచి పరిణామమే. జట్టు గెలవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిందే. అందులో భాగంగానే గిల్ పై వేటు పడింది.
మంచి కూర్పు...
ఇక జితేశ్ శర్మను కూడా దూరం పెట్టడానికి మరొక కారణం ఉంది. జితేశ్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ సీనియర్ ఆటగాడిగా, అందులోనూ వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ ను ఎంపిక చేయడంతో అతనిని పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చిందన్నది అందరి అభిప్రాయం. అదే సమయంలో రింకూసింగ్ లాంటి హిట్టర్ కుచోటు కల్పించడం కూడా అవసరమే. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, హర్షిత్ రాణాలను ఎంపిక చేయడం మంచి పరిణామంగా భావిస్తున్నారు.



Tags:    

Similar News