Telangana : నేడు కొత్త సర్పంచ్ పదవీ ప్రమాణం

నేడు తెలంగాణలో సర్పంచ్ లుగా ఎన్నికయిన వారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Update: 2025-12-22 02:46 GMT

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నేడు సర్పంచ్ లుగా ఎన్నికయిన వారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడుదశల్లో ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సర్పంచ్ లతో పాటు ఉప సర్పంచ్ లు కూడా గెలుపొందారు. వీరంతా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పదవీ బాధ్యతలు...
తెలంగాణలోని అన్ని పంచాయతీలలో సర్పంచ్ ల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ల ప్రమాణ స్వీకారాన్ని పంచాయతీ రాజ్ అధికారులు దగ్గరుండి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నేటి నుంచి నూతన సర్పంచ్ లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.


Tags:    

Similar News