మర్డర్ చేసింది…అడ్డంగా బుక్కయిపోయింది
నేరాలు చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. ఇద్దరు భార్యాభర్తలు కానీ ఎవరికి వారే నేరం చేయడంలో అందెవేసిన చెయ్యి. తమిళనాడులోని ప్రజలను 500 కోట్ల [more]
నేరాలు చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. ఇద్దరు భార్యాభర్తలు కానీ ఎవరికి వారే నేరం చేయడంలో అందెవేసిన చెయ్యి. తమిళనాడులోని ప్రజలను 500 కోట్ల [more]
నేరాలు చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. ఇద్దరు భార్యాభర్తలు కానీ ఎవరికి వారే నేరం చేయడంలో అందెవేసిన చెయ్యి. తమిళనాడులోని ప్రజలను 500 కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టారు . జైలుకు వెళ్లారు . ఐదేళ్లపాటు చిప్పకూడు తిన్నారు. భార్య కంటే ముందే భర్త బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి తలదాచుకున్నాడు. జైలు నుంచి విడుదలైన భార్యకు భర్త ఆచూకీ కనిపించలేదు. దీంతో ఐదేళ్లుగా ఆంధ్ర ,తమిళనాడు, తెలంగాణ లో భార్య సుకన్య వెతుకుతుంది . చివరకు భర్త ఆచూకీ తెలియడంతో హైదరాబాద్ కు వచ్చింది. మరో మహిళతో కలిసి భర్త ఉండటాన్ని భార్య సుకన్య గుర్తించింది. భర్త ను తన వెంట తీసుకొని వెళ్లే ప్రయత్నం చేసింది. భర్త ఒప్పుకోక పోవడంతో హత్య చేసింది . భర్త హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం భార్య బోల్తాపడింది. చివరకు మళ్ళీ పోలీసులకు చిక్కింది.
ఇద్దరూ కలసి ముంచేసి…
చెన్నైకి చెందిన ప్రభాకరన్, సుకన్య(32) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. చెన్నైలో మనీ బ్యాక్ స్కీమ్ ప్రారంభించిన ప్రభాకరన్ 2012లో ఆర్థిక నేరాలకు పాల్పడటంతో సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రభాకరన్ భార్య సుకన్య కూడా అదే కేసులో ఐదు సంవత్సరాలు జైలుకు వెళ్లి వచ్చింది. భర్త సమాచారం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరిలో బంధువుల వద్ద పిల్లలతో కలిసి ఉంటోంది. జైలు నుంచి వచ్చిన ప్రభాకరన్ మౌలాలి ఆండాళ్‌నగర్‌లో నివాసముంటున్నాడు. చర్చిపాస్టర్‌గా, సంఘ సేవకుడిగా పనిచేసేవాడు. తనతో తీసుకెళ్లేందుకు సుకన్య ప్రయత్నించింది. కేర్‌టేకర్ గా ప్రభాకరన్ వద్ద ఉన్న మహిళను మాన్పించింది. కేర్ టేకర్‌ను రప్పించాలని భార్యతో ప్రభాకరన్ గొడవపడుతున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను, పిల్లలను చంపుతానని ప్రభాకరన్ బెదిరిస్తున్నాడు.
మళ్లీ గొడవ జరగడంతో….
ఈ నెల 23వ తేదీ రాత్రి కేర్‌టేకర్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని దిండుతో మొహం మీద పెట్టీ హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి మరుసటి రోజు ఉదయం ఆమెనే 100 నంబర్‌కు కాల్ చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు చేయడానికి సుకన్య నిరాకరించడం, సంఘటన స్థలంలో కొన్ని వస్తువులు అనుమానాస్పదంగా కనిపించడంతో సుకన్యను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం అంగీకరించింది. ఈ నేపథ్యంలో సుకన్యను రిమాండ్‌కు పోలీస్ తరలించారు.