Revanth Reddy : ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా
మున్సిపల్ ఎన్నికలు ముగిసన వెంటనే రైతు భరోసా నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
మున్సిపల్ ఎన్నికలు ముగిసన వెంటనే రైతు భరోసా నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించినట్లే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. తెలంగాణ జాతిపిత అంటున్నారని, ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని జాతిపిత అంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఎవరు జాతి? వినోద్ రావా? ఎర్రబెల్లి దయాకర్ రావా? హరీశ్ రావా? అని ప్రశ్నించారు. మొగుడు, పెళ్లాం మాట్లాడుకుంటుంటే వారి ఫోన్లను కూడా వినేందుకు ప్రయత్నించారని రేవంత్ ెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి అవుతుందని అన్నారు. మంది ఫోన్లు వినేవాడు మనేషానా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.