Tirumala : తిరుమలకు నేడు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. వేచి ఉండకుండానే?

తిరుమలలో భక్తుల నేడు ర‌ద్దీ తగ్గింది

Update: 2026-02-04 03:13 GMT

తిరుమలలో భక్తుల నేడు ర‌ద్దీ తగ్గింది. బుధవారం కావడంతో పాటు ఇటీవల వరసగా రద్దీతో కిటికిటలాడిన తిరుమల వీధులన్నీ ఇప్పుడు భక్తులు తక్కువగా ఉండి సాదాసీదాగా కనిపిస్తున్నాయి. సాధారణంగా తిరుమలో నిత్యం భక్తులతో కళకళలాడుతుంది. అయితే వరస సెలవులు రావడంతో పాటు ఇక పరీక్షలు ప్రారంభం కానుండటంతో కొంత రద్దీ తగ్గే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా భక్తులకు అవసరమైన లడ్డూలు, అన్నప్రసాదాలను తయారు చేస్తున్నారు.

పరీక్షల సమయంలో...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పుడూ తగ్గదు. అయితే పరీక్షల సమయంలోనే కొంత రద్దీ తక్కువగా ఉంటుంది. విద్యార్థులకు ఫిబ్రవరి నెల నుంచి మార్చి వరకూ పరీక్షల సీజన్. ఈ మూడు నెలల్లో తక్కువగానే ఉంటుంది. అయితే శుక్ర, శని, ఆదివారాలు మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ భక్తుల రద్దీ తగ్గినప్పటికీ స్వామి వారి హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. కంపార్ట్ మెంట్లు కూడా ఖాళీగానే ఉండటంతో భక్తులు సులువుగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
నాలుగు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. నిన్న 69,389 భక్తుల సంఖ్య శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు 20,247 సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News