Hyderabad : తల్లిని తాను ఇక చూసుకోలేని యువతి బలవన్మరణం
హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెనక తల్లికి దూరమవుతానన్న బాధ ఉంది
హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి యువతి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే యువతి డబ్బులున్నా తల్లి కోసం ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ యువతి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు లక్షరూపాయలు సంపాదిస్తూ హాయిగా జీవితం ఎంజాయ్ చేయాల్సిన అమ్మాయి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి చేసుకుంటే అనారోగ్యంతో ఉన్న తన తల్లి.. ఎక్కడ ఒంటరై పోతుందేమోనని బెంగతో ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం...
రెండు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతిని పోలీసులు గుర్తించారు. . లేక్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ బైంసాకు చెందిన విజయలక్ష్మి అని పోలీసులు తెలిపారు. విజయలక్ష్మి తన తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి కూకట్ పల్లిలోని మోతి నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు లక్ష రూపాయల వేతనం సంపాదస్తుంది. తనకు వచ్చే సంపాదనతో తల్లిని బాగా పోషించుకోవాలని విజయలక్ష్మి ఆలోచన.
తల్లి అనారోగ్యంతో...
తల్లి పూర్తిగా అనారోగ్యంతో ఉండడంతో ఆమె బాగోగులు చూసుకుంటోంది. అయితే ఆమె బంధువులు విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో 'తాను పెండ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లికి చాలా ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఆమె అనేకసార్లు మదన పడేదని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక తన గూగుల్ లో వెదికింది. జనవరి 31న రాపిడో టూ వీలర్ బుక్ చేసుకుని మధ్యాహ్నం 12:30 గంటలకు ట్యాంక్ బండ్ చేరుకుని అన్నమయ్య విగ్రహం వద్ద హుస్సేన్ సాగర్ లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. తల్లి అనారోగ్యం, పెండ్లి సంబంధాలు మానసిక బాధతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.