Gold Prices Today : బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టిన వారు ఢమాల్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి

Update: 2026-02-04 03:36 GMT

బంగారం ధరలు భారీగా పెరిగి తిరిగి కిందకు చూస్తున్నాయి. గత వారం రోజుల నుంచి వరసగా భారీగా బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. దీంతో పెట్టుబడి పెట్టిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. బంగారం, వెండి ధరలు గత ఏడాది జనవరి నుంచి విపరీతంగా పెరగడంతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చని తమ వద్ద ఉన్న కొద్ది పాటి మొత్తాన్ని ఈ రెండు వస్తువులపైనే ఎక్కువ మంది మదుపు చేశారు. అలాగే తమ వద్ద గత కొంత కాలంగా ఉన్న బంగారం, వెండి ఆభరణాలను విక్రయించి సొమ్ము చేసుకున్న వారు కూడా ఉన్నారు. ధరలు బాగా ఉన్న సమయంలో అమ్ముకున్న వారికి మంచి లాభాలు వచ్చాయి. ఇంకా పెరుగుతాయని వేచి చూసిన వారు మాత్రం నష్టపోయారు.

గత కొన్ని రోజులుగా...
గత కొన్ని నెలల్లో బంగారం, వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. ఏ ఆస్తి అయినా ఇంత వేగంగా పెరిగినప్పుడు ప్రైస్ కరెక్షన్ అనేది సహజం. ప్రస్తుతం జరుగుతున్నది అదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ధరలు మరింత దిగివ అవకాశం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. డిమాండ్ పూర్తిగా పడిపోవడంతో పాటు అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కూడా ధరల తగ్గుదలకు కారణమని అంటున్నారు. అందుకే ఎక్కువ మొత్తంలో మదుపు చేయడం అంత మంచిది కాదు. తమకున్న మొత్తంలో కొంత మొత్తాన్ని దాచుకుని, కొం మేరకు మాత్రమే పొదుపు చేయగలిగితే లాభమయినా.. నష్టమయినా భరించే శక్తి ఉంటుంది. అలాగని ఉన్నది మొత్తం తక్కువ సమయంలో లాభం వస్తుందని పెట్టుబడి పెడితే ఆశలు ఆవిరవుతాయి.
నేటి ధరలు...
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. దీంతో వినియోగదారులు ఇక తాము కొనుగోలు చేయడానికి మంచి సమయమని భావిస్తున్నారు. మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో ధరలు తగ్గడం శుభపరిణామమే. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,41,110 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,53,940 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,99,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News