బ్రేకింగ్ : సుశాంత్ సింగ్ మృతి కేసు సీబీఐకి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతిని సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసును కేంద్ర ప్రభుత్వం [more]

Update: 2020-08-19 05:41 GMT

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతిని సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దీనిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ జరిగిన మీదట సుశాంత్ సింగ్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబయి పోలీసుల దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సహకరించాలని కోరింది.

Tags:    

Similar News