Hyderabad : న్యూ ఇయర్ వేడుకలు సక్సెస్.. ఒక్క ప్రమాదం కూడా జరగకుండా?

హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సరం వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగాయి.

Update: 2026-01-01 06:07 GMT

హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సరం వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపి జరిగే ప్రమాదాల వల్ల ఒక్క పెద్ద ప్రమాదం కూడా నమోదు కాలేదని పోలీసులు వెల్లడించారు. కఠిన అమలు చర్యలు, నగరవ్యాప్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాలే దీనికి కారణమని పేర్కొన్నారు. ప్రతి ఏటా మద్యం తాగి రోడ్లమీదకు వచ్చి అనేక ప్రమాదాలు జరిగాయి. కానీ ఈ ఏడాది మాత్రం ప్రమాద రహితంగా పోలీసులు వేడుకలు నిర్వహించడానికి ముందస్తు చర్యలు సత్ఫలితమిచ్చాయి.

పోలీసుల హెచ్చరికలతో...
మద్యం తాగితే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి పట్టుబడితే భారీగా జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పతీవ్ర స్థాయిలో చేసిన హెచ్చరికలు మందుబాబులపై పనిచేశాయి. కొందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలోనే మద్యాన్ని తాగి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. చాలా మంది స్థాయికి మించి మద్యాన్ని సేవించకుండా రోడ్డుపైకి వచ్చారు. అతిగా మద్యం సేవించిన వారు కూడా డ్రైవ్ చేయకుండా ప్రత్యేక వాహనాలలో ఇంటికి వెళ్లారు. దీంతో ప్రమాదాల సంఖ్య జీరోకు పడిపోయింది.
అవగాహన పెంచడంతో...
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మాట్లాడారు. రోడ్డు భద్రత సాధనలో పోలీసు సిబ్బంది, వివిధ విభాగాలు, పౌరులు సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. మద్యం డ్రైవింగ్‌పై కఠిన తనిఖీలు, సమర్థవంతమైన అవగాహన కార్యక్రమాలు ప్రమాదాల నివారణలో కీలకంగా నిలిచాయని చెప్పారు. హైదరాబాద్‌ను మరింత సురక్షితమైన, నిజంగా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు. మొత్తం మీద హైదరాబాద్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు చేసిన హెచ్చరికలు సత్ఫలితాలు ఇచ్చినట్లేనని అనుకోవాలి. అందుకే శభాష్ పోలీస్.


Tags:    

Similar News