Hyderabad : కొత్త ఏడాది అమలులోకి వచ్చే నిబంధనలు ఇవే

నూతన సంవత్సరం ప్రవేశించింది. కొత్త నిబంధనలు కూడా నేటి నుంచి అమలులోకి వచ్చాయి

Update: 2026-01-01 03:04 GMT

నూతన సంవత్సరం ప్రవేశించింది. 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే అదే విధంగా ఈ ఏడాది అనేక ఆర్థిక విధానమైన మార్పులు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకింగ్ సేవలతో పాటు డిజిటల్ లావాదేవీలు, పన్ను చెల్లింపులతో సహా అనేక విభాగాల్లో కొత్త నిబంధనలను నేటి నుంచి అమలులోకి వచ్చేశాయి. అవేంటో తెలుసుకోవాలనుకుందా... అయితే.. ఈ స్టోరీ చదివేయండి...ప్రధానంగా ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై పర్యవేక్షణను మరింత పెంచనుంది. అలాగే వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నంల్ వంటి మెసేజింగ్ యాప్ ల కోసం సిమ్ వెరిఫికేషన్ లను కూడా కఠినతరం చేసింది. ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు ఈ చర్యలను చేపట్టింది.

బ్యాంకు లావాదేవీలపై...
ఇక నేటి నుంచి బ్యాంకుల్లో కూడా క్రెడిట్, డెబిట్ కార్డు నిబంధనలు సవరించనున్నారు. వీటిని ఆ యా బ్యాంకులు అధికారికంగా తమ కస్టమర్లకు తెలియజేయనున్నాయి. అదే సమయంలో నేటి నుంచి ఫ్రిడ్జ్ లు, టెలివిజన్లు, ఎల్.పి.జి గ్యాస్ స్టవ్ లు, కూలింగ్ టవర్లకు కేంద్ర ప్రభుత్వం స్టార్ లేబుళ్లను తప్పనిసరి చేసింది. ఖచ్చితంగా ఇంధన వినియోగానికి ఉపయోగపడే స్టార్ లేబుళ్లను విస్తృతంగా తనఖీలను కూడా నిర్వహించనుంది. ఖచ్చితంగా నిబంధనలను కూడా ఇక కఠినతరం చేయనుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇప్పటి వరకూ నెలకు ఒకసారి తమ కస్టమర్లకు సంబంధించిన వివరాలను ప్రతి పక్షం రోజులకు ఒకసారి అప్ డేట్ చేసేవి.
నేటి నుంచి ధరలు పెరిగే...
ఇకపై వారానికి ఒకసారి అప్ డేట్ చేయనున్నారు. క్రెడిట్ స్కోరు ప్రకారమే రుణాల మంజూరు లభించనుంది. ఇక పాన్, ఆధార్ కార్డును లింకు చేయడం నిన్నటితో పూర్తి కావాల్సి ఉంది. అయితే అలా లింకు చేయని వారికి బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలను పొందేందుకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ పథకాలు కూడా లింకు చేయని వారికి అందవు. ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేయకపోతే నేటి నుంచి పాన్ కార్డులు పనిచేయవని ముందుగానే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కార్ల ధరలు నేటి నుంచి పెరగనున్నాయి. ఏసీలు, ఫ్రిడ్జ్ ల ధరలు కూడా పెరుగుతాయి. నేటి నుంచి ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి రానున్నాయి. అందుకే ప్రజలు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని కోరుతున్నారు.











Tags:    

Similar News