KCR : కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తున్నారటగా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2026-01-01 12:13 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల సమయం పూర్తి కావడంతో ఇక శాసనసభలోనూ, బయటా ప్రభుత్వం తీరును ఎండగట్టడమే లక్ష్యంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని సమాచారం. తనకు మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వకపోయినా అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. అలాగే ఎక్కువ సమయం ఇస్తే తాను అన్నివిషయాలను సభాముఖంగా ప్రజలకు అసలు విషయాలను తెలియచేసే వీలుంటుందన్నది కేసీఆర్ ప్లాన్ గా ఉంది. అందుకే ఆయన ఎర్రవెల్లి ఫాం హౌస్ కు వెళ్లకుండా నందినగర్ లోని తన నివాసంలోనే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేపు సభకు వస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అసెంబ్లీ సమావేశాలకు...
అసెంబ్లీకి రానున్న కేసీఆర్ జనవరి 2 నుంచి జరిగే సమావేశాలకు హాజరవుతానని ముఖ్య నేతలతో చెప్పారని తెలిసింది. సభలో జరిగే కృష్ణా, గోదావరి జలాలపై చర్చలో పాల్గొననున్నారని సమాచారం. నాడు ఉద్యమ నాయకుడిగా అయినా..తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా తాను ప్రజా పక్షాన నిలుచున్నానని చెప్పడమేఆయన రాకకు ముఖ్య ఉద్దేశ్యమని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే తొలి రోజు కేవలం రెండు నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్లిపోయిన కేసీఆర్ ఆయన వచ్చే అవకాశాలు లేవని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ సభకు వస్తే సరైన సమయం ఆయన మాట్లాడేందుకు ఇవ్వడమే కాకుండా ఆయన చేసే విమర్శలకు తాము ధీటుగా సమాధానమిస్తామని చెబుతున్నారు.
నీటి పారుదల అంశంపై...
కృష్ణా జలాలు, పాలమూరు ఎత్తిపోతలపై కాంగ్రెస్ సర్కార్ తీరును కేసీఆర్ మీడియా సమావేశంలో తప్పు పట్టారు. ఇక పోరు బాటే అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే అసెంబ్లీ మొదలయింది. మొదటి రోజు సమావేశాలకు వచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ దగ్గరికి వెళ్లి మరీ సీఎం రేవంత్‌ పలకరించారు. కానీ తాను పాలమూరు - ఎత్తిపోతల పథకంపై పూర్తి స్థాయిలో మరోసారి విమర్శలు చేసేందుకు శాసనసభ తనకు ధీటైన ప్రదేశమనికేసీఆర్ననమ్ముతున్నారు. మరి కేసీఆర్ రేపటి సభకు హాజరవుతారా?లేదా? అన్నది ఆసక్తిగా మారింది. కేసీఆర్ సభకు రావడమే తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి కేసీఆర్ సభకు రావడంపై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం మాత్రం అందలేదు.


Tags:    

Similar News