Gold Price Today : కొత్త ఏడాది తొలి రోజు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు మరింత తగ్గనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఏడాది తొలి రోజు మాత్రం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. గత మూడు రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతున్నాయి. వెండి ధరల్లో కూడా భారీగా పతనం కనిపిస్తోంది. బంగారం ధరలు తగ్గాయని భావిస్తే మాత్రం అది ఇంకా మధ్యతరగతి ప్రజలకు మాత్రం అందుబాటులోకి రాలేదు. ధరలు ఇంకా తగ్గితేనే మధ్యతరగతి, వేతన జీవులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్న భావన వ్యక్తమవుతుంది. అయితే కొత్త ఏడాది తొలి రోజున మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గుదల పట్టడంతో పసిడిప్రియులు ఒకరకంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఏడాది కూడా ధరలు తగ్గుతాయని తాము భావించలేదని చాలా మంది చెబుతున్నారు.
ఇంకా అందుబాటులోకి...
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంకా అందనంత దూరంలోనే ఉన్నాయని చాలా మంది అభిప్రాయం. అయితే మార్కెట్ నిపుణుల అంచనా మేరకు ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ధరలు తగ్గుతాయని ఇంకా వేచి చూస్తే మళ్లీ ధరలు పెరిగే అవకాశముంటుందని వారు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికాలో ఫెడరల్ రేట్ల ప్రభావం వంటివి బంగారం, వెండి ధరల్లో మార్పునకు కారణమవుతున్నాయి. రానున్న కాలంలో ధరలు మరింత పెరుగతాయన్న అంచనాల నేపథ్యంలో త్వరపడి కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
సీజన్ కాకపోయినా...
పెళ్లిళ్ల సీజన్ ప్రస్తుతం లేకపోయినా ధరలు మాత్రం అదుపులో ఉండటం లేదు. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే ధరలు పెరగడం, తగ్గడం అనేది అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. మూడు రోజుల్లోనే బంగారం ధర ఐదు వేల రూపాయల వరకూ తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,640 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,34,880 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,56,900 రూపాయలుగా నమోదయింది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పు ఉండవచ్చు