Hyderabad : న్యూ ఇయర్.. మందుబాబులు అడ్డంగా బుక్కయ్యారుగా?

హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి

Update: 2026-01-01 02:45 GMT

హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు హైదరాబాద్ లో చాలా మంది మద్యం సేవించి బుక్ అయ్యారు. నిన్న రాత్రంతా పోలీసులు నగరంలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ముందు నుంచి పోలీసులు హెచ్చరిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలను నడపవద్దని హెచ్చరించారు. అలాగే హైదరాబాద్ లో నిన్న రాత్రి పది గంటల నుంచి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించారు. ప్రతి చోట పోలీసులు వాహనాలను అడ్డుకుని దానిపై వస్తున్న వారికి పరీక్షలను నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఉత్సాహం చూపిన అనేక మంది పోలీసుల దెబ్బకు బుక్ అయిపోయారు.

పోలీసు ఆంక్షలను...
హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. నిన్న రాత్రి ఒంటి గంట వరకూ నూతన సంవత్సర వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. 2026 నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే నగరవాసులు అనేక చోట్ల వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. గేటెడ్ కమ్యునిటీల్లో రాత్రి వరకూ వేడుకలన నిర్వహించుకుని కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. తమ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను కలుపుకుని ఈ వేడుకులను జరుపుకున్నారు. అయితే అనేక చోట్ల పోలీసుల ఆంక్షలను మాత్రం అమలులో పెట్టలేక వేడుకలను రోడ్డుమీద జరుపుకుందామని వచ్చిన వారు కూడా బుక్ అయ్యారు.
పన్నెండు వందలకు పైగా కేసులు...
పోలీసులు విస్తృత్తంగా ఒక్క హైదరాబాద్ నగరంలో దాదాపు 36 చోట్ల తనిఖీలను నిర్వహించారు. ముందు నుంచి పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాగి నడిపితే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే పోలీసుల హెచ్చరికలు వారి చెవికెక్కలేదు. ప్రజల భద్రత దృష్ట్యా మద్యం తాగి రోడ్డు మీదకు రావద్దని చెప్పినా వినలేదు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు పన్నెండు వందలకు పైగా కేసులు బుక్ అయినట్లు చెబుతున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఇక డ్రగ్స్ పై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపారు. వనస్థలి పురంలో మద్యం మత్తులో రోడ్డు మీద హల్ చల్ చేశాడు. తాను తాగి బండి నడపకపోయినా పోలీసులు తనపై కేసు నమోదు చేశారంటూ రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. తెల్లవారు జాము వరకూ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.
Tags:    

Similar News